Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా హత్యకు ఓ రాజకీయ పార్టీ కుట్ర.. సుపారీ కూడా ఇచ్చింది: మమత బెనర్జీ

కేంద్రంలోని ఎన్డీయేపై నిప్పులు చెరుగుతూ.. సర్కారు విధానాలను తప్పుబట్టే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరిగిందని మమత బెనర్జీ ఆరోపించారు. తనను అంతమొందించే

Webdunia
శనివారం, 12 మే 2018 (11:44 IST)
కేంద్రంలోని ఎన్డీయేపై నిప్పులు చెరుగుతూ.. సర్కారు విధానాలను తప్పుబట్టే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరిగిందని మమత బెనర్జీ ఆరోపించారు. తనను అంతమొందించేందుకు ఓ రాజకీయ పార్టీ కిరాయి హంతకులను కూడా నియమించుకుందని విమర్శించారు.
 
ఈ మేరకు తనను హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు తన దృష్టికి కూడా వచ్చిందని, ఇందుకోసం ఓ పార్టీ సుపారీ కూడా ఇచ్చింది. అడ్వాన్స్ తీసుకున్న కిరాయి హంతకులు తన నివాసం, కార్యాలయం, ఇతర సమీప ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించారంటూ మమత చెప్పుకొచ్చారు. కానీ తనకు ఇవి అలవాటైపోయాయని, గతంలో కుట్రల నుంచి తాను ప్రాణాలతో బయపడ్డానన్నారు.
 
ఇదిలా ఉంటే.. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ సీఎం కేసీఆర్‌‌తో మార్చిలో భేటీ అయ్యారు. దేశ రాజకీయాల్లో మార్పే లక్ష్యమని ప్రకటించిన కేసీఆర్‌‌ జాతీయ రాజకీయాలు, ఫ్రంట్‌ ఏర్పాటుపై మమతా బెనర్జీతో చర్చించిన సంగతి తెలిసిందే. నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సహకరించాలని మమతను కేసీఆర్ కోరినట్లు సమాచారం. 
 
మరోవైపు బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీలు కేంద్రంపై అవిశ్వాస యుద్ధం చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కొత్త ఫ్రంట్‌ ఏర్పాటుకు మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments