Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుణేలోని ఓ ఇంట్లో పాముల స్మగ్లింగ్.. 70 పాముల్ని కలిగిన బాక్సును సీజ్ చేసిన పోలీసులు..

మహారాష్ట్రలోని పుణేలోని ఓ ఇంట్లో పాములను స్మగ్లింగ్ చేసేందుకు ఓ బాక్సులో ఉంచారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఇంట్లో తనిఖీలు చేయగా ఈ స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టయింది. మొత్తం 70 పాములు కలిగిన బాక్

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (09:31 IST)
మహారాష్ట్రలోని పుణేలోని ఓ ఇంట్లో పాములను స్మగ్లింగ్ చేసేందుకు ఓ బాక్సులో ఉంచారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఇంట్లో తనిఖీలు చేయగా ఈ స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టయింది. మొత్తం 70 పాములు కలిగిన బాక్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. వాటిల్లో 41 రస్సెల్ వైపర్స్‌ను, 31 నాగుపాములు ఉన్నాయి. రంజిత్ ఖరగే ఇంట్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ పాములను పోలీసులు ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. 
 
భార్యాపిల్లలతో కలిసి నివసించే రంజిత్ రహస్యంగా పాములను స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ విశేషమేంటంటే, ఆ ఇంట్లో ఉంటున్న చిన్న పిల్లలకు కూడా ఇంట్లో పాములున్న సంగతి తెలుసు. పాములు పట్టుకునే వారి దగ్గర్నుంచి, అడవిలో సంచరించే పాములను పట్టుకుని వారు ఈ అక్రమ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పాముల్ని అడవిలో సురక్షితంగా విడిచిపెట్టినట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments