అంత ఉక్కగా ఉంటే రా వచ్చి నా ఒళ్లో కూర్చో : ఉబర్ డ్రైవర్ చీప్ కామెంట్స్

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (17:31 IST)
ఓలా, ఉబర్ వంటి ట్రావెల్ యాప్స్ తమ డ్రైవర్ల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అడపాదడపా కొన్ని చెడు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఒక మహిళ పట్ల ఉబర్ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన చోటుచేసుకుంది. ఏసీ గాలి రావడం లేదన్నందుకు, అయితే తన ఒళ్లో వచ్చి కూర్చోమంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేసాడు.
 
ఢిల్లీలో ఉంటున్న అమృత తన భర్తతో కలిసి ఉబర్‌లో క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. జరిగిన విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. "అసభ్యకరంగా ప్రవర్తించిన ఉబర్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ముందు అతను ఏసీ వేయడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఏసీ వేసినా కూడా చల్లగా లేకపోవడంతో ఉక్క పోస్తోందని అడిగాను. అందుకు అతను ‘అంత ఉక్కగా ఉంటే రా వచ్చి నా ఒళ్లో కూర్చో’ అని కమెంట్ చేసాడు. ఆ సమయంలో నాతో పాటు నా భర్త కూడా ఉన్నారు" అంటూ పేర్కొని ఆ ట్వీట్‌కు ఢిల్లీ పోలీసులను, ఉబర్ యాజమాన్యాన్ని ట్యాగ్ చేసింది. 
 
అంతేకాకండా కార్ నంబర్‌ను, క్యాబ్ డ్రైవర్‌ను ఫోటో తీసి వాటిని కూడా జత చేసింది. ఈ ఘటనపై స్పందించిన ఉబర్ "ఇలా జరగడం చాలా బాధగా ఉంది. మా టీమ్ మీకు ఇమెయిల్‌లో ప్రతిస్పందించింది. మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే అడగండి" అంటూ రీట్వీట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments