Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన మనసింకా అంతరిక్షంలోనే వుంది... వ్యోమగామి శిరీష బండ్ల

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (08:34 IST)
వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఆదివారం చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. ఈ యాత్రలో పాలుపంచుకున్న వ్యోమగాముల్లో భారత సంతతికి చెందిన గుంటూరు జిల్లా యువతి శిరీష బండ్ల (34) కూడా ఉన్నారు. 
 
ప్రపంచ కుబేరుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వీఎస్ఎస్ యూనిటీ-22 వ్యోమనౌక చారిత్రాత్మక రీతిలో అంతరిక్ష విహారం చేసి సురక్షితంగా భూమికి తిరిగొచ్చిన విషయం తెల్సిందే. వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో పరిశోధన విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న శిరీష బండ్ల కూడా ఈ యాత్రలో భాగమై అంతరిక్ష యానం చేసింది.
 
తన అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి సురక్షితంగా భూమికి చేరిన తర్వాత ఆమె తన తొలి రోదసి యాత్రపై స్పందించారు. తాను పట్టరాని సంతోషంలో మునిగిపోయినట్టు చెప్పారు. అంతరిక్షం నుంచి భూమిని చూడడం ఓ అద్భుతమైన అనుభూతి అని వ్యాఖ్యానించారు. 
 
యాత్ర ముగిసి తాము భూమికి చేరినా, తన మనసింకా అంతరిక్షంలోనే ఉందని వ్యాఖ్యానించారు. అంతరిక్షానికి వెళ్లాలన్నది తన చిన్ననాటి కల అని, ఇన్నాళ్లకు అది సాకారమైందని, అది కూడా సంప్రదాయేతర మార్గంలో నెరవేరిందని శిరీష వెల్లడించారు. ఇప్పటికీ తాను రోదసిలోకి వెళ్లి వచ్చానంటే నమ్మశక్యం అనిపించడంలేదని, ఆ భావన వర్ణనాతీతం అని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments