Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనం చేయడం ఎలా.. యూట్యూబ్ వీడియోలు చూసి.. ఓ వ్యాపారి..?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (19:19 IST)
యూట్యూబ్‌లో వీడియోలను చూసి చాలామంది ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటుంటే.. యూట్యూబ్ కారణంగా ఓ వ్యాపారి దొంగతనం నేర్చుకున్నాడు. తాజాగా లాక్‌డౌన్‌ సమయంలో జరిగిన నష్టాలను తిరిగి పొందడానికి ఓ రెడీమేడ్ బట్టల వ్యాపారి.. యూట్యూబ్ వీడియోలు చూసి రెండు బ్యాంకులను దోచుకున్నాడు. బొమ్మ తుపాకులను ఉపయోగించి ఇతగాడు దోచుకున్న రూ.12 లక్షలను స్వాధీనం చేసుకుని కటకటాల్లోకి పంపారు.
 
వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్ నగర శివార్లలోని తంగిబంట గ్రామానికి చెందిన సౌమ్యరంజన్ జెనా అలియాస్ తులు రెడీమేడ్‌ వస్త్రాలను విక్రయిస్తుంటాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 
 
నష్టాలను పూడ్చుకోవడానికి దొంగతనం చేయడం ఒక్కటే పరిష్కారం అని నమ్మిన సౌమ్యరంజన్‌.. యూట్యూబ్‌లో దొంగతనం చేయడం ఎలా అనే వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాడు. బొమ్మ తుపాకీని కొనుగోలు చేసిన సౌమ్యరంజన్‌.. గత నెల ఏడో తేదీన ఇన్ఫోసిటీకి సమీపంలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, 28 తేదీన మంచేశ్వర్ ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా, బరిముండా బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తంలో నగదు దోచుకున్నాడు.
 
నిందితుడికి రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. దాదాపు రూ.19 లక్షల రుణం తీసుకుని వస్త్రాల వ్యాపారం చేస్తున్నాడు. నిందితుడి నుంచి రూ.12 లక్షల నగదుతో పాటు బొమ్మ తుపాకీ, ఒక బైకును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments