Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి పీటలపై ప్రియురాలు... అదేపనిగా ఆమెనే చూస్తున్న ప్రియుడు... ఏమైంది?

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (12:36 IST)
ఐదు నిమిషాల్లో పెళ్ళి జరగాల్సి ఉంది. అయితే ఉన్నట్లుండి పెళ్ళి కూతురు మండపం నుంచి పైకి లేచి పరుగెత్తుకొని వెళ్ళి తన మెడలోని పూలదండను ప్రియుడికి వేసి పెళ్ళి చేసుకుందాం రమ్మంది. దీంతో తనకు కాబోయే భార్య వేరొకరిని పెళ్ళి చేసుకోవడం ఏంటో అర్థం కాక పెళ్ళిపీటలపై ఉన్న వరుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే తేరుకున్న తల్లిదండ్రులు పెళ్ళి కూతురు చెల్లెలిని ఇచ్చి వరుడికి వివాహం చేసి శాంతింపజేశారు.
 
ఉత్తరప్రదేశ్ లోని ఉత్రౌలీ ప్రాంతంలో నివాసముంటున్న రంజన్, జ్వాల దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తెను తమ బంధువుల అబ్బాయితో లగ్నం కుదుర్చుకున్నారు. నిన్న రాత్రి ఇంటి వద్దనే వివాహం జరుగుతోంది. అయితే అప్పటికే ఆ యువతి తన ఇంటి పక్కనే ఉన్న మరో యువకుడితో ప్రేమలో పడింది. అయిష్టంగానే పెళ్ళికి ఒప్పుకుంది. 
 
నిన్న రాత్రి పెళ్లి జరుగుతోంది. ఎదురుగా ప్రియుడు కూర్చుని వున్నాడు. అంతే.... ముహూర్తం సమయానికి పెళ్ళి పీటలపై నుంచి లేచి నేరుగా యువకుడి మెడలో పూలమాల వేసేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు షాకయ్యారు. ఇక వరుడి సంగతి వేరే చెప్పక్కర్లేదు. దండ వేయించుకున్న ప్రియుడిని చితక బాదేందుకు ప్రయత్నించగా వధువు తల్లిదండ్రులు అతడిని శాంతింపజేసి తన రెండవ కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేసేశారు. ఆ పెళ్ళి వైభవంగా జరుగ్గా ప్రేమించిన యువతి పెళ్లి పందిరిలో ఆ పెళ్లిని వేడుకగా చూసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments