Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రికి వెళ్తూ మార్గమధ్యంలోనే తల్లి మృతి.. శవాన్ని బైకుపైనే ఇంటికి తీసుకొచ్చారు..

మొన్నటికి మొన్న ఒడిశాలో మృతదేహాలను మోసుకుంటూ వెళ్ళిన భర్త సంగతి, నిన్నటికి నిన్న అదే రాష్ట్రంలో మృతదేహపు వెన్నెముకను విరగ్గొట్టిన ఘటన మరవకముందే.. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తల్లి శవాన్న

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (19:27 IST)
మొన్నటికి మొన్న ఒడిశాలో మృతదేహాలను మోసుకుంటూ వెళ్ళిన భర్త సంగతి, నిన్నటికి నిన్న అదే రాష్ట్రంలో మృతదేహపు వెన్నెముకను విరగ్గొట్టిన ఘటన మరవకముందే.. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తల్లి శవాన్ని ఇద్దరు కుమారులు బైక్‌పై 12 కిలో మీటర్ల దూరంలోని ఇంటికి తరలించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నఅమ్మను కాపాడేందుకు ఇద్దరు కుమారులు వైద్యం కోసం వెళ్లారు. 
 
కానీ వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంబులెన్స్‌కు ఫోన్ చేసిన స్పందనే లేదు. దీంతో 70 ఏళ్ళ పార్వతీ బాయ్‌ను ఆమె కుమారులు బైక్‌పై సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. చేసేదేమీలేక ఆవేదనను దిగమింగుకుని తల్లి శవాన్ని బైక్‌పైనే తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.
 
ఇదిలా ఉంటే.. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కాన్పూర్‌లోనూ పన్నెండేళ్ల బాలుడు వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప‌న్నెండేళ్ల కుమారుడికి తీవ్ర జ్వ‌రం రావ‌డంతో స్థానిక జేవీఎస్ఎం వైద్య కళాశాల హాస్ప‌టిల్‌కి తీసుకెళ్ళిన సునీల్ కుమార్‌తో వైద్యులు దురుసుగా వ్య‌వ‌హ‌రించారు. వైద్యుల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే త‌న కొడుకు మ‌ర‌ణించాడ‌ని, క‌నీసం ఎమ‌ర్జెన్సీ లో అడ్మిట్ చేసుకుని ప‌రిక్ష‌లు చేయాల‌ని బ‌తిమాలిన ప‌ట్టించుకోలేద‌ని ఆ తండ్రి ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. 
 
వైద్యం అందించకుండా తిప్పించారని ఆ తండ్రి వాపోయాడు. ఆ స‌మ‌యంలో స్ట్ర‌చ్చ‌ర్ కూడా అందించ‌క పోవ‌డంతో, ఆ తండ్రి త‌న కొడుకుని భుజాల పైనే మోసుకుంటూ తిరిగాడు. ఈ క్ర‌మంలోనే ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న వివాదాస్పదం కావడంతో ఆ బాలుడు ముందే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపి వైద్యులు తమ నిర్లక్ష్యపు చర్యను సమర్థించుకున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments