Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదిగో ఇక్కడే ఉంది నీ ఫ్లాట్... షీనాకు మెడిసన్ కాక్‌ టెయిల్ ఇచ్చి గొంతునులిమి చంపేశారు

దేశంలో సంచలనం సృష్టించిన కార్పొరేట్ హత్య కేసులో షీనా బోరా కేసు ఒకటి. ఈ కేసులో కన్నతల్లే ప్రధాన నిందితురాలు. ఈ కేసులోని మిస్టరీని ఛేదించిన సీబీఐ నిందితులందరినీ అరెస్టుచేశారు. ప్రస్తుతం వీరివద్ద సీబీఐ ప

Webdunia
శనివారం, 29 జులై 2017 (08:54 IST)
దేశంలో సంచలనం సృష్టించిన కార్పొరేట్ హత్య కేసులో షీనా బోరా కేసు ఒకటి. ఈ కేసులో కన్నతల్లే ప్రధాన నిందితురాలు. ఈ కేసులోని మిస్టరీని ఛేదించిన సీబీఐ నిందితులందరినీ అరెస్టుచేశారు. ప్రస్తుతం వీరివద్ద సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ సాగుతోంది. ఈ విచారణలో భాగంగా, షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా గురించి ఓ విషయం వెలుగులోకి వచ్చింది. షీనాను గొంతునులిమి హత్య చేసి, అడవిలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించే ముందు.. షీనా పెదవులకు లిప్‌స్టిక్ రాసి.. జుట్టుకట్టిందని ఇంద్రాణి డ్రైవర్ సంచలన విషయాన్ని వెల్లడించాడు. 
 
షీనా బోరా కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, డ్రైవర్‌ శ్యామ్‌వర్‌ రాయ్‌, ఇంద్రాణి భర్త పీటర్‌ ముఖర్జియా, మాజీ భర్త సంజీవ్‌ఖన్నాను అరెస్టు చేసిన సీబీఐ ప్రస్తుతం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం విచారణ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో షీనాను హత్య చేసిన విధానాన్ని అప్రూవర్‌గా మారిన ఇంద్రాణి ముఖర్జియా డ్రైవర్‌ శ్యామ్‌వర్‌ రాయ్‌ వివరించాడు. 
 
'ఏప్రిల్‌ 24, 2012న షీనాబోరాను కారులో తీసుకెళ్లాం. దారిలో మెడిసిన్‌ కాక్‌ టెయిల్‌, ఆల్కహాల్‌ ఇచ్చాం. సరిగ్గా అప్పుడు ఇంద్రాణి ఆమెకు ఎదురుగా కూర్చుంది. వెనుకాలే కూర్చున్న ఇంద్రాణి మాజీ భర్త షీనా జుట్టును గట్టిగా పట్టుకోగా ఒక్కసారిగా ఇంద్రాణి ఆమె గొంతును నులిమింది. దీంతో ఆర్తనాదాలు చేసే ప్రయత్నం చేస్తుండగా నేను నోరు మూశాను. ఆ సమయంలో ఆమె నా బొటన వేలిని కొరికింది. కొద్ది సేపట్లోనే ఆమె ప్రాణం పోయింది. 
 
ఆ తర్వాత ఆమె మృతదేహంతో వెళ్లే సమయంలోనే కారులో షీనా ముఖంపై కూర్చున్న ఇంద్రాణి 'ఇదిగో ఇక్కడే ఉంది నీ ఫ్లాట్' అంటూ నాకు ఇవ్వాల్సిన ఫ్లాట్‌ను గుర్తు చేసింది. అనంతరం అడవిలోకి వెళ్లాం. ఆ సమయంలో షీనా పెదాలకు లిప్‌స్టిక్‌ రాసి జుట్టుకట్టింది. ఆ తర్వాత పెట్రోల్‌పోయగా ఆమె నిప్పంటించింది. వెంటనే తిరిగొచ్చి దారిలో కాఫీ తాగాం. అప్పుడే ఈ విషయం మర్చిపోవాలని నాకు వార్నింగ్‌ ఇచ్చారు' అని శ్యామ్‌వర్‌ రాయ్‌ కోర్టుకు వివరించాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్: 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

తర్వాతి కథనం
Show comments