Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహిష్కరణకు గురైన వ్యక్తి ఇపుడు హోంమంత్రిగా ఉండటం విచిత్రం : శరద్ పవార్

సెల్వి
శనివారం, 27 జులై 2024 (16:54 IST)
రాష్ట్ర బహిష్కరణకు గురైన ఓ వ్యక్తి ఇపుడు దేశ హోం మంత్రిగా ఉండటం విచిత్రమని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అవినీతిపరులకు ముఠా నాయుకుడిగా శరద్ పవార్‌ను పోల్చుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. దేశంలోని అవినీతిపరులకు నేనొక ముఠా నాయుకుడిని అంటూ అమిత్ షా నాపై విమర్శలు చేశారు. కానీ, గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టు అమిత్ షాను రెండేళ్ళు గుజరాత్ నుంచి బహిష్కరించింది. అలాంటి వ్యక్తి ఇపుడు దేశానికే హోంమంత్రిగా ఉండటం విచిత్రం అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
 
చట్టాలను దుర్వినియోగం చేశారన్న కేసులో అమిత్ షాను సుప్రీంకోర్టు రెండేళఅలు బహిష్కరించింది నిజం కాదా, మన దేశం ఎలాంటి వ్యక్తుల చేతిలో ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంటువంటి వ్యక్తులు దేశాన్ని అవినీతి మార్గంలోనే నడిపిస్తారు అంటూ శరద్ పవార్ ధ్వజమెత్తారు. గతంలో సంచలనం సృష్టించిన సొహ్రబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు అమిత్ షాను రెండేళ్ల పాటు గుజరాత్ నుంచి బహిష్కరించిన విషయం తెల్సిందే. ఈ అంశాన్నే శరద్ పవరా తాజాగా ఎత్తి చూపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments