Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాఢంగా ప్రేమించుకుని.. శృంగారంలో పాల్గొంటే.. అది అత్యాచారం కిందకు రాదు

ప్రేమించుకున్నట్లు ఆధారాలుంటే అది అత్యాచారం కిందకు రాదని బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రేమించుకుని పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే తర్వాత రేప్ కేసు పెడితే నిందితుడిగా దోషిగా పరిగణించవద

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (09:11 IST)
ప్రేమించుకున్నట్లు ఆధారాలుంటే అది అత్యాచారం కిందకు రాదని బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రేమించుకుని పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే తర్వాత రేప్ కేసు పెడితే నిందితుడిగా దోషిగా పరిగణించవద్దని బాంబే హైకోర్టు పేర్కొంది. ఇద్దరూ ప్రేమించుకున్నట్లు ఆధారాలుంటే ఆ సంబంధాన్ని అత్యాచారం కిందకు పరిగణించకూడదని కోర్టు తేల్చి చెప్పింది.
 
ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడి కేసును విచారించిన ట్రయల్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చుతూ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇంకా పదివేల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పును హైకోర్టును తోసిపుచ్చింది. వివరాల్లోకి వెళితే.. 2013లో యోగేష్ తన తోటి ఉద్యోగిని ప్రేమించారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో శారీరకంగా కలిశారు. 
 
కానీ విభేదాలు రావడంతో ఆమెను వివాహం చేసుకునేందుకు యోగేష్ నిరాకరించాడు. దీంతో యోగేష్‌పై రేప్ కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు యోగేష్‌ను దోషిగా తేల్చింది. ఏడేళ్ల జైలు శిక్ష విధించి.. రూ.10వేల జరిమానా విధించింది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. 
 
కేసును విచారించిన బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ ట్రయల్ కోర్టు తీర్పును తప్పుబట్టింది. ప్రేమతో ఒక్కటయ్యారని ఆధారాలున్నప్పుడు.. యోగేష్‌ను దోషిగా పేర్కొనడం సరికాదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం