Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడి సుఖం కోసం తాగుబోతు భర్తను కడతేర్చిన భార్య.. ఎక్కడ?

ప్రియుడి సుఖం కోసం తాగుబోతు భర్తను కసాయి భార్య కడతేర్చింది. ప్రియుడి సహాయంతో అత్యంత పాశవికంగా హత్య చేయడమేకాకుడండా మృతదేహంపై పెట్రోల్ పోసి, ముళ్లపొదల్లో వేసి నిప్పు పెట్టారు.

ప్రియుడి సుఖం కోసం తాగుబోతు భర్తను కడతేర్చిన భార్య.. ఎక్కడ?
, ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (10:53 IST)
ప్రియుడి సుఖం కోసం తాగుబోతు భర్తను కసాయి భార్య కడతేర్చింది. ప్రియుడి సహాయంతో అత్యంత పాశవికంగా హత్య చేయడమేకాకుడండా మృతదేహంపై పెట్రోల్ పోసి, ముళ్లపొదల్లో వేసి నిప్పు పెట్టారు. ఈ దారుమం గుంటూరు జిల్లా మార్కాపురం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ వివరాలు పరిశీలిస్తే, 
 
శ్రీశైలం మండలం సున్నిపెంట బస్టాండ్‌ సెంటర్లో పండ్లు, కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకునే శ్రీరాంశెట్టి భాస్కర్‌రావు, నేలటూరి శ్రీను స్నేహితులు. వీరిలో శ్రీను తాగుబోతు. దీంతో ఊరంతా అప్పులపాలయ్యాడు. ఈ అప్పుల ఒత్తిడి తట్టుకోలేక ఊరివిడిచి పారిపోయాడు. దీంతో శ్రీను భార్య మల్లీశ్వరితో భాస్కర్ రావు పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. 
 
అయితే, ఊరివిడిచి వెళ్లిన శ్రీను తిరిగి ఇంటికి తిరిగివచ్చి, తన భార్యకు, భాస్కర్ రావుకు మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని తెలుసుకుని గద్దించాడు. దీంతో భర్తను హతమార్చాలని మల్లీశ్వర ప్లాన్ వేసి, భాస్కర్ రావు సాయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 24న భాస్కరరావు తన ఆటోలో కొబ్బరి బొండాల లోడుతో వస్తూ శ్రీనును ఎక్కించుకున్నాడు. పెద్దారవీడు మండలం హనుమాన్‌ జంక్షన్‌ కుంట వద్ద తన ఆటోలో ఉన్న సరకును వేరే ఆటోలో ఎక్కించాడు. అక్కడి నుంచి వారిద్దరూ సున్నిపెంటకు తిరుగు ప్రయాణమయ్యారు. 
 
పెద్దదోర్నాలకు రాత్రి 11 గంటలకు రావడంతో అడవిలో సున్నిపెంటకు వెళ్లేందుకు అనుమతి లేదని.. రాత్రికి ఇక్కడే ఉండి పోదామని శ్రీనుతో భాస్కర్‌రావు చెప్పాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. శ్రీను బాగా మద్యం తాగడంతో పూర్తిగా మత్తులో మునిగిపోయాడు. తన వద్ద ఉన్న కండువాతో శ్రీను మెడకు బిగించి గట్టిగా లాగాడు. అనంతరం మెడపై కాలితో బలంగా తొక్కాడు. 
 
చనిపోయాడని నిర్ధరించుకున్న తర్వాత తనతో పాటు తెచ్చుకున్న పెట్రోలును శ్రీను ముఖంపై పోసి కంప చెట్లలోకి తోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. గుర్తు తెలియని మృతదేహం కాలువలో కనిపించిందని దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూసిన శ్రీను బంధువులు పెద్దదోర్నాల పోలీసు స్టేషన్‌కు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. మల్లీశ్వరి, భాస్కర్‌రావులు ఊరివిడిచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటకలో ఒంటరిపోరు.. బీజేపీ సర్కారు తథ్యం : అమిత్ షా