Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మించి సహజీవనం చేయడం రేప్ కిందేలెక్క : సుప్రీంకోర్టు

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (09:27 IST)
ప్రేమించి మోసం చేసే కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి మోసం చేయడం అనేది అత్యాచారం కిందకే వస్తుందని, అలాంటి వారిని శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన ఓ యువతిని అదే రాష్ట్రానికి చెందిన అనురాగ్ సోనీ అనే యువకుడు ప్రేమించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు. వీరిద్దరూ కొన్ని నెలల పాటు సహజీవనం చేశారు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో ముఖం చాటేశాడు. దీంతో బాధిత యువతి కోర్టును ఆశ్రయించింది. కింది కోర్టు విచారణ జరిపి ప్రేమ పేరుతో మోసం చేసినందుకు పదేళ్ల జైలు శిక్ష వేసింది. దీన్ని హైకోర్టులో నిందితుడు సవాల్ చేశాడు. అక్కడా చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
 
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఎల్‌ నాగేశ్వర రావు, జస్టిస్‌ ఎమ్‌ఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు కాబట్టి, శారీరక కలయికకు ఆమె సమ్మతిని సాధారణ అనుమతిగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. లైంగికంగా కలిసేందుకు ఆమె అంగీకరించినా అది అత్యాచారమేనని, హత్య కన్నా రేప్ అత్యంత దారుణమైనదని చివాట్లు పెట్టింది, నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం