Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో భార్య గర్భవతి... భార్యను అలా చేయమన్నాడు... ఆమె ఏం చేసిందంటే?

వివాహేతర సంబంధం ఓ ఉద్యోగి ప్రాణాలు బలిగొంది. ఈ హత్య అతి కిరాతకంగా జరిగిందని పోలీసులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన 27 ఏళ్ళ విపిన్ శుక్లా పంజాబ్ భటిండా సమీపంలోని ఎయిర్ బేస్‌లో విధులు

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (19:10 IST)
వివాహేతర సంబంధం ఓ ఉద్యోగి ప్రాణాలు బలిగొంది. ఈ హత్య అతి కిరాతకంగా జరిగిందని పోలీసులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన 27 ఏళ్ళ విపిన్ శుక్లా పంజాబ్ భటిండా సమీపంలోని ఎయిర్ బేస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఎయిర్ ఫోర్స్ భార్యల సంక్షేమ సంఘం క్యాంటీన్‌లో కార్పొరల్‌గా ఉన్న అతడికి యూపీకి చెందిన సార్జెంట్ సులేష్ కుమార్ భార్య అనురాధ పటేల్‌తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో అనురాధ పటేల్ గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని కూడా కోరింది. 
 
కానీ అప్పటికే విపిన్ శుక్లాకు పెళ్లి కావడంతో నో చెప్పాడు. చివరకు ఈ విషయం సులేష్‌కు తెలియడంతో అల్లరికాకుండా ఉండేందుకు విపిన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. క్వార్టర్ మారుతున్నానని ఫోన్ చేసి రమ్మన్నాడు. అక్కడకు వచ్చిన విపిన్‌ శుక్లాను భార్య, బావతో కలిసి హత్య చేశాడు. మృతదేహాన్ని ఓ పెట్టెలో పెట్టి మరో క్వార్టర్‌కు మారాడు. ఫిబ్రవరి 19న విపిన్ మృతదేహాన్ని 16 ముక్కలుగా నరికాడు.
 
శరీర భాగాలను పాలిథిన్ కవర్లలో చుట్టి కొన్నింటిని ఫ్రిజ్‌లో మరికొన్ని అల్మారాలో దాచాడు. ఫిబ్రవరి 8న జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. కానీ విపిన్ భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్స్ సహకారంతో మృతదేహాన్ని గుర్తించారు. ఈ హత్యకు కారణమైన సార్జెంట్ సులేష్ కుమార్, అతడి భార్య అనురాధను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారిలో ఉన్న బావ శశి భూషన్ కోసం గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

తర్వాతి కథనం