Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ పనిచేయలేదు.. మార్చివ్వలేదని.. తల్లీకూతుళ్ల ఓవరాక్షన్.. ఢిల్లీలో దారుణం..

దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు అడ్డాగా మారిపోయింది. ఓ వైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే.. మరోవైపు నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఢిల్లీలోని ఓ మొబైల్ దుకాణంలో ముగ్గురు మహిళలు హల్‌చల్ చేశారు.

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (17:59 IST)
దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు అడ్డాగా మారిపోయింది. ఓ వైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే.. మరోవైపు నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా  ఢిల్లీలోని ఓ మొబైల్ దుకాణంలో ముగ్గురు మహిళలు హల్‌చల్ చేశారు. 
 
తమ మొబైల్ బాగు చేయలేదని ఆరోపిస్తూ దుకాణంలో టేబుల్ కిందపడేసి, హంగామా సృష్టించారు. సదరు దుకాణంలో తల్లీకూతుళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదంతా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ ఘటన ఢిల్లీలోని రాజౌరీ ప్రాంతంలో చోటుచేసుకుంది.  
 
సీసీ టీవీలో రికార్డైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సదరు వీడియోలో ముగ్గురు మహిళలు షో రూమ్‌లోని వస్తువులను ధ్వంసం చేశారు. షోరూమ్‌లో పనిచేస్తున్న వారిపై చేజేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓ మహిళ ఇటీవలే ఈ షో రూం నుంచి ఓ మొబైల్ కొనుగోలు చేసింది. కానీ ఆ మొబైల్ సరిగా పని చేయలేదు. దీంతో ఆమె షో రూంకు వచ్చింది. వేరొక మొబైల్ మార్చి ఇవ్వాలని చెప్పింది. 
 
కానీ షో రూమ్ వాళ్లు మొబైల్‌ను మార్చేందుకు నో చెప్పారు. అంతే నాణ్యత లేని మొబైల్ ఇచ్చారంటూ.. సదరు మహిళ, ఆమె కుమార్తె షో రూంలో హంగామా సృష్టించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments