Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలక్టోరల్ బాండ్ల అంశంలో ఎస్.బి.ఐకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (15:29 IST)
ఎన్నికల బాండ్ల అంశంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకుకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించింది. వివరాలన్నీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. క్రమ సంఖ్యతో సహా చెప్పాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ వివరాలన్నింటితో గురువారం సాయంత్రం ఐదు గంటల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. బ్యాంకు నుంచి వివాలన్నీ అందినవెంటనే వాటిని వెబ్‌సైట్‌‍లో అప్‌లోడ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంచేసింది. 
 
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందజేసే విరాళాలపై ఎస్.బి.ఐ అందించిన అసంపూర్ణ డేటాపై దాఖలైన పిటిషన్‌‍పై సోమవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. బ్యాంకు ఆధీనంలో ఉన్న ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని తాము కోరుకుంటున్నట్టు జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. అంతేకాకుండా, తాము ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని స్పష్టం చేస్తూ గురువారం సాయంత్రం 5 గంటలలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్.బి.ఐ ఛైర్మన్‌ను ధర్మాసనం ఆదేశించింది. బ్యాంకు నుంచి ఆ వివరాలు అందిన వెంటనే వాటిని వెబ్‌సైట్‌‍లో అప్‌లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ : శ్రీతేజ్‌‍ను పరామర్శించిన పుష్పరాజ్! (Video)

అగాతియా నుంచి జీవా, రాశి ఖన్నాలపై ఫస్ట్ సింగిల్ గాలి ఊయలలో.. రిలీజ్

సినీ జర్నలిజాన్నే గౌరవంగా భావించి ఎదిగిన బి ఏ రాజు- 65వ జయంతి

గేమ్ చేంజర్ నా ఆలోచనాధోరణి మార్చింది - చిరంజీవి ప్రశంస నేషనల్ అవార్డు : అంజలి

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లో కథ చెప్పేసిన అనిల్ రావిపూడి - ప్రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments