Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు తగ్గిన క్రేజ్.. శశికళకు పెరిగిన క్రేజ్.. పోయెస్ గార్డెన్‌లో క్యూ.. అమ్మ సమాధి దగ్గర లేదు ఎందుకు?

తమిళనాట దివంగత సీఎం జయలలితను ఆమె ఫ్యాన్స్ మరిచిపోయారని టాక్ వస్తోంది. జయలలితకు క్రేజ్ తగ్గిపోయిందని.. ఆమె నెచ్చెలి శశికళకు క్రేజ్ అమాంతం పెరిగిపోతోందని సమాచారం. అందుకు కారణం అమ్మ సమాధి దగ్గర కన్నా ఇప్

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (12:34 IST)
తమిళనాట దివంగత సీఎం జయలలితను ఆమె ఫ్యాన్స్ మరిచిపోయారని టాక్ వస్తోంది. జయలలితకు క్రేజ్ తగ్గిపోయిందని.. ఆమె నెచ్చెలి శశికళకు క్రేజ్ అమాంతం పెరిగిపోతోందని సమాచారం. అందుకు కారణం అమ్మ సమాధి దగ్గర కన్నా ఇప్పుడు పోయెస్ గార్డెన్ లో శశికళను పరామర్శించే వారి సంఖ్య రెట్టింపవుతోంది. మెరినా బీచ్‌లోని అమ్మ సమాధి దగ్గర ఐదు వేల మంది అభిమానులు ఉంటే పోయెస్ గార్డెన్‌లో శశికళను పరామర్శించే వారి సంఖ్య మరింత ఎక్కువైందని టాక్ వస్తోంది. 
 
అన్నాడీఎంకే కార్యకర్తలు మాత్రమే శశికళకు విరుద్ధమైతే.. ప్రజలు మాత్రం శశికళకు దగ్గరవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తమిళనాడులోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు చిన్నమ్మా మీరే దిక్కు అంటూ ఆమె కాళ్లమీద పడిపోతున్నారు. అయితే దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎన్నో సంవత్సరాల నుంచి పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసం ఉంటున్న వేదనిలయంలో ఒక్కసారైనా అడుగుపెట్టాలని అన్నాడీఎంకే కార్యకర్తలు ఆశగా ఉంటుంది. 
 
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న జయలలిత ఇంటిలో సామాన్యంగా ఎవ్వరినీ అనుమతించరు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. అమ్మ మరణించిన తరువాత పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో జయలలిత నెచ్చెలి శశికళ నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే నాయకులు నేరుగా వేదా నిలయంలోకి వెళ్లి శశికళను పరామర్శిస్తున్నారు.
 
కార్యకర్తలు వేదా నిలయం గుమ్మం ముందు క్యూకడుతున్నారు. ప్రతి రోజూ కొన్ని వేలమంది శశికళను ఓదార్చడానికి, పరామర్శించడానికి వస్తున్నారు. నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకుల దగ్గర క్యూ కన్నా, జయలలిత సమాధిని దర్శించుకోవడానికి వచ్చే వారి సంఖ్య కన్నా ఇప్పుడు పోయెస్ గార్డెన్ లోని వేద నిలయం ముందు శశికళను పరామర్శించడానికి క్యూ ఎక్కువగా ఉంది. దీంతో అమ్మ కంటే చిన్నమ్మకే క్రేజ్ బాగా పెరిగిపోతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments