Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాట బీజేపీ పాగా వేయడం ఖాయమా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లినట్టేనా?

తమిళనాట బీజేపీ జెండా ఎగిరేందుకు రంగం సిద్ధం అయ్యింది. ప్రాంతీయ పార్టీలకు పెట్టని కోటలా ఉన్న తమిళనాడు.. ఇక జాతీయ పార్టీలకు గేట్లు తెరవక తప్పని పరిస్థితులు నెలకొన్నాయనే వాదన వినిపిస్తోంది. ఏళ్లపాటు పోరా

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (12:16 IST)
తమిళనాట బీజేపీ జెండా ఎగిరేందుకు రంగం సిద్ధం అయ్యింది. ప్రాంతీయ పార్టీలకు పెట్టని కోటలా ఉన్న తమిళనాడు.. ఇక జాతీయ పార్టీలకు గేట్లు తెరవక తప్పని పరిస్థితులు నెలకొన్నాయనే వాదన వినిపిస్తోంది. ఏళ్లపాటు పోరాడుతున్నప్పటికీ.. అక్కడ ఏదో ఒక ప్రాంతీయ పార్టీ లేకుండా ఏ పార్టీకి సింగిల్ సీటు కూడా దక్కని పరిస్థితి. అయితే ప్రస్తుతం సీన్ మారింది. కేంద్రంలోని పార్టీలు తమిళనాడు వైపు చూస్తున్నాయి. 
 
తమిళనాట బీజేపీలో పాగా వేయాలని పక్కా ప్రణాళికలు చేస్తున్నారు. తాజాగా త‌మిళ తంబీలంతా అమ్మ‌గా పిలుచుకునే దివంగ‌త సీఎం జె.జ‌య‌ల‌లిత శ‌కం ముగిసింది. మూడు ద‌శాబ్దాల‌కు పైగా అన్నాడీఎంకేను తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా న‌డిపించిన జ‌య… అనారోగ్యంతో ఇటీవలే క‌న్నుమూశారు. జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ పగ్గాలను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యమైంది. ఎందుకంటే… ఎప్ప‌టినుంచో త‌మిళ‌నాట జెండా పాతేందుకు బీజేపీ కాసుకుని కూర్చుంది. ఇందులో భాగంగా అనారోగ్యంతో జ‌య ఆసుప‌త్రిలో చేర‌గానే త‌న‌దైన మంత్రాంగంతో ఎంట్రీ ఇచ్చింది.
 
వ‌రుస‌గా కేంద్ర మంత్రులు త‌మిళ‌నాడు రావ‌డం, జ‌య ఆరోగ్యంపై వాక‌బు చేయ‌డం, జ‌య‌ను ప‌మార్శించేందుకే వ‌చ్చామంటూ తమిళ తంబీలకు దగ్గరయ్యారు. దీంతో తమిళనాట కేంద్ర మంత్రులు చక్రం తిప్పారు. ఇందులో భాగంగా బీజేపీకి జ‌య స్థానంలో త‌మిళ‌నాడు సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఒ.ప‌న్నీర్ సెల్వం క‌నిపించారు.

ఆయన్ని పావుగా చేసుకుని అన్నాడీఎంకేను తన చేతిలో తమిళనాడును తీసుకునేందుకు బీజేపీ సర్వం సిద్ధం చేసుకుంటోంది. జరుగుతున్న పరిణామాలతో తమిళనాడులో బీజేపీ పాగా వేయడం కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments