బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న చిన్నమ్మ శశికళకు రాజభోగాల సంగతి రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. దీంతో కర్ణాటక సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా కర్ణాటక సర్కారు చిన్నమ్మపై నిఘా వుం
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న చిన్నమ్మ శశికళకు రాజభోగాల సంగతి రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. దీంతో కర్ణాటక సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా కర్ణాటక సర్కారు చిన్నమ్మపై నిఘా వుంచింది. హోసూరు నుంచి అంబులెన్సులో ఆమెకు రకరకాల వస్తువులు వస్తున్నాయని తేలింది. ఈ వ్యవహారం వెనుక కర్ణాటకకు చెందిన ఓ మంత్రి హస్తం ఉందని తేలడంతో ఆయన ఎవరనే దానిపై చర్చ మొదలైంది.
జైలులో ఓ ఎస్ఐ స్థాయి అధికారి వీఐపీ సౌకర్యాలు కల్పించడంతోనే తరిస్తున్నట్లు ఓ అనామకుడు కర్ణాటక డీజీపీ మొదలు, కీలక అధికారులందరికీ రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో కర్ణాటక సర్కారు విచారణను వేగవంతం చేసింది. చిన్నమ్మకు జైలులో ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయనే దానిపై నిఘా వుంచింది. తద్వారా శశికళకు మరిన్ని చిక్కులు తప్పవని రాజకీయ వర్గాల సమాచారం.
కాగా.. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని డీఐజీ రూప బయటపెట్టిన విషయం తెలిసిందే. శశికళ వ్యవహారం బయటపడటంతో జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణరావ్ తో సహ డీఐజీ రూప తదితరులను బదిలి చేశారు. ప్రతి రోజు మూడు పూటల శశికళకు కావాలసిన అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) మధ్యాహ్నం, రాత్రికి అవసరం అయిన భోజనంతో పాటు తాజా పండ్లు, డ్రైఫ్రూట్స్, పాలు, పెరుగు తదితర ఆహార పదార్థాలను ఎస్ఐ గజరాజ్ మాకనూర్ జైలు బయట నుంచి తెప్పించి చిన్నమ్మకు సప్లై చేస్తున్నారని కొత్త విషయంలో వెలుగులోకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.