Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె కోర్కె తీర్చలేదనీ భార్యను.. బిడ్డను హతమార్చిన కసాయి

తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో ఓ దారుణం జరిగింది. అర్థరాత్రి ఇంటికి వచ్చిన టెంపో డ్రైవర్.. తన కుమార్తె వద్దకు వెళ్లి కామవాంఛ తీర్చాలని బలవంతం చేశాడు. దీనికి ఆ బిడ్డతో పాటు భార్య అడ్డుపడింది.

Webdunia
బుధవారం, 26 జులై 2017 (09:58 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో ఓ దారుణం జరిగింది. అర్థరాత్రి ఇంటికి వచ్చిన టెంపో డ్రైవర్.. తన కుమార్తె వద్దకు వెళ్లి కామవాంఛ తీర్చాలని బలవంతం చేశాడు. దీనికి ఆ బిడ్డతో పాటు భార్య అడ్డుపడింది. అంతే ఒక్కసారి ఆగ్రహోద్రుక్తుడైన డ్రైవర్... రోకటిబండతో ఇద్దరి తలలు పగులగొట్టి హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జిల్లాలోని ఆరుంజెట్టి అనే గ్రామానికి చెందిన శేషాద్రి (38) అనే వ్యక్తి టెంపో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య కుముద (36), 15 యేళ్ళ కుమార్తె ఉంది. ఈ బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే, సోమవారం అర్థరాత్రి ఇంటికి వచ్చిన శేషాద్రి నేరుగా కుమార్తె పడుకుని ఉన్న గదికి వెళ్లి లైంగిక కోర్కె తీర్చాలంటూ వేధించాడు. దీంతో ఒక్కసారి షాక్‌కు గురైన ఆ బాలిక... బిగ్గరగా కేకలు వేయడంతో పక్కనే పడుకుని వున్న తల్లి  కుముద నిద్రలేచి భర్తను అడ్డుకుంది. 
 
ఆ తర్వాత కుమార్తె ముందే భార్యతో శేషాద్రి అసభ్యంగా ప్రవర్తించి.. కోర్కె తీర్చాలని పట్టుబట్టాడు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో ఆగ్రహోద్రుక్తుడైన ఆ కామాంధుడు.. పక్కనే ఉన్న రోకటిబండతో భార్య తలపై బలంగా కొట్టడటంతో ఆమె అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. దీన్ని అడ్డుకోబోయిన కుమార్తెను కూడా కొట్టి చంపేసి, ఇంటినుంచి పారిపోయాడు. 
 
అయితే, తల్లిని కొట్టడాన్ని చూసిన ఆ బాలిక బిగ్గరగా అరిచింది. వీటినివిన్న ఇరుగుపొరుగువారు వచ్చి చూడగా, ఇంట్లో రక్తపు మడుగులో తల్లీకూతుళ్ళ మృతదేహాలు పడివున్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి పారిపోయిన కసాయి భర్తను అరెస్టు చేశారు. తన కోర్కె తీర్చనందుకే హత్య చేసినట్టు ఆ కామాంధుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం