Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైల్లో ఖైదీలకు చుక్కలు చూపిస్తున్న శిశికళ అల్లుడు... ఓం... హ్రీం... కాళీమాతాకీ జై...

ఒక్కొక్కరు ఒక్కోలా పూజలు చేస్తుంటారు. కొంతమంది పూజలు చేస్తుంటే మనసు ప్రశాంతంగా, హాయిగా వుంటుంది. మరికొందరు పూజలు చేస్తూ మంత్ర తంత్రాలను జపిస్తుంటే శరీరం వణికిపోతుంది. దీనితో కొందరికి పూనకం కూడా వస్తుంది. ఇంకొందరికైతే నాలుక పిడచకట్టుకుపోయి నోట్లో నుంచ

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (13:28 IST)
ఒక్కొక్కరు ఒక్కోలా పూజలు చేస్తుంటారు. కొంతమంది పూజలు చేస్తుంటే మనసు ప్రశాంతంగా, హాయిగా వుంటుంది. మరికొందరు పూజలు చేస్తూ మంత్ర తంత్రాలను జపిస్తుంటే శరీరం వణికిపోతుంది. దీనితో కొందరికి పూనకం కూడా వస్తుంది. ఇంకొందరికైతే నాలుక పిడచకట్టుకుపోయి నోట్లో నుంచి మాటలు రావు. మరికొందరికైతే వణుకుపుట్టి భయంతో పరుగులు తీస్తారు. 
 
ఇదంతా ఎందుకయా అంటే... తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుదామని అక్రమాస్తుల కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ మేనల్లుడు, జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్ గురించే. ఇతడు బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. మరి శిక్ష నుంచి త్వరగా బయటకు రావాలంటే కాళీమాతను ప్రసన్నం చేసుకోవాలని ఎవరైనా చెప్పారో ఏమోగానీ, జైల్లో ఖాళీ మాత ఫోటోను పెట్టి పెద్దపెద్దగా మంత్రాలు జపిస్తూ తోటి ఖైదీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడట. 
 
అతని మంత్రాల దెబ్బకు వారంతా వణికిపోతున్నారట. అయ్యా జైలరు గారూ... ఆయనతో మేము వుండలేం మహాప్రభో అని అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నారట. అతడి పూజలు సంగతి పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారట. అదీ సంగతి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ లాంచ్ చేసిన బాపు నుంచి అల్లో నేరేడల్లో పిల్లా సాంగ్

స్ట్రైట్ సాంగ్ కంటే డబ్బింగ్ సాంగ్ రాయడం కష్టం ఫ గీత రచయిత కేకే (కృష్ణకాంత్)

అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్ గ్రేడింగ్ చూసి థ్రిల్ అయ్యా : SS రాజమౌళి

ఎవరికి గేమ్ ఛేంజర్ అవుతుంది...రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments