Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ.. ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోండి : ఎంకే స్టాలిన్

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, విపక్ష నేత ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, క

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (10:14 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, విపక్ష నేత ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు విజ్ఞప్తి చేశారు. అలాగే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యేందుకు నిర్ణయించి.. ఆయన అపాయింట్‌మెంట్ కోరారు. 
 
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడాన్ని అడ్డుకోవాలని వినతిపత్రం సమర్పించనున్నారు. దీంతో పాటు రేపు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సమావేశం కానున్నారు. తమిళనాడు పరిణామాలపై జోక్యం చేసుకోవాలనీ కోరనున్నారు. శశకళ సీఎం అవ్వడాన్ని తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామనే దానిపై పార్టీ అభిప్రాయంతో పాటు తన అభిప్రాయాన్ని కూడా ప్రధానికి వివరించనున్నట్టు డీఎంకే ప్రకటించింది. 
 
చట్టప్రకారం ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా పకడ్బందీగా అన్ని చర్యలు తీసున్నామని శశికళ శిబిరం భావిస్తోంది. అయితే స్టాలిన్ మాత్రం తమిళ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏఐఏడీఎంకే నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారనీ... అదే ఎజెండాగా ప్రధానితో చర్చించనున్నారని చెబుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments