Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధాశ్రమంలో బాలికపై అత్యాచారం... సహోద్యోగులే కామాంధులు...

రంగారెడ్డి జిల్లాలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తూ వచ్చిన ఒక దళిత బాలిక (12)పై ఆశ్రమంలో పని చేసే ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ రేప్ గత యేడాది కాలంగా చేస్తూ వచ్చారు. తాజాగా బాధితురాలి ఫి

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (09:45 IST)
రంగారెడ్డి జిల్లాలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తూ వచ్చిన ఒక దళిత బాలిక (12)పై ఆశ్రమంలో పని చేసే ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ రేప్ గత యేడాది కాలంగా చేస్తూ వచ్చారు. తాజాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. 
 
పోలీసుల కథనం మేరకు... రాజమండ్రికి చెందిన 12 యేళ్ళ బాలిక హైదరాబాద్‌కు సమీపంలోని నాగోల్‌లో ఉన్న అక్షయ్ వృద్ధాశ్రమంలో నెలకు రూ.3 వేల వేతనానికి పనిలో చేరింది. అక్కడ పని చేసే ముగ్గురు వ్యక్తులు ఈ బాలికపై కన్నేశారు. ఆ తర్వాత ఆ బాలికను బెదిరించి ముగ్గురు నిర్వాహకులు ఒక యేడాది కాలంగా వేర్వేరుగా తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ కామాంధుల వేధింపులను భరించలేని ఆ బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎల్.బి. నగర్ పోలీసులు శ్రీనివాస రెడ్డి, మాణిక్య రావు, వేణుగోపాల్‌ అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గతంలో పలుమార్లు అత్యాచారం చేసినా ఆ యువతి ఫిర్యాదు చేయలేదని ఎల్బీ నగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ జి.సుదర్శన్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments