Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాలతో సానిటైజేషన్ - గాలిలో కరోనాకు చెక్

Webdunia
సోమవారం, 31 మే 2021 (09:10 IST)
గాలి ద్వారా కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనల మధ్య వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది ఏరియల్​వర్క్స్​ ఏరో ఎల్​ఎల్​పీ అనే సంస్థ. చిన్నపాటి విమానాల సాయంతో క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తోంది.
 
ఆఫ్రికా, అమెరికాలో ఇప్పటికే ఈ సంస్థ భారీ స్థాయిలో ఏరియల్​ స్ప్రే పనులు చేపట్టింది. ఆధునిక సాంకేతికతతో సేంద్రీయ ద్రావణాన్ని మైక్రాన్ల పరిమాణంలో పిచికారీ చేసి, గాలిలో ఎక్కువ సమయం ఉండేలా చేస్తుంది.

దాంతో గాలి తుంపర్లలో తేలియాడే బ్యాక్టీరియా, వైరస్​ను నశింపజేసి, కొవిడ్​ సోకే ముప్పును తగ్గిస్తుంది.బెంగళూరులోని అత్యధిక జనాభా గల ప్రాంతాల్లో పిచికారీ కోసం ఏరోవర్క్క్​ తో 3 రోజుల పైలట్​ ప్రాజెక్టును ప్రారంభించారు కర్ణాటక ఆర్థిక మంత్రి ఆర్​.అశోక్.
 
300  లీటర్ల లోడింగ్​ సామర్థ్యంతో గంటకు 741 ఎకరాల్లో అమెరికన్​ ఛాంపియన్​ స్కౌట్​ విమానంతో క్రిమిసంహాకర ద్రావణాన్ని పిచికారీ చేస్తోంది ఏరోవర్క్స్​ ఎల్​ఎల్​పీ.

మంచి ఫలితాల కోసం ఐసీఎంఆర్​ ధ్రువీకరించిన ఎయిర్​లెన్స్​ మైనస్ కరోనా, సుగరధాన అనే రెండు రకాల సేంద్రీయ ద్రావణాల్ని వాడుతోంది. ఈ రెండూ రసాయన రహిత, మానవ సురక్షిత ద్రావణాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెబల్ స్టార్ ప్రభాస్ తో మూడు మెగా సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

'అమ్మ'కు ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేయను : మోహన్ లాల్

ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవరికీ సపోర్ట్ చేయరని తేల్చి చెప్పిన దిల్ రాజు

"గేమ్ ఛేంజర్" టీజర్‌ను ఏయే థియేటర్లలో రిలీజ్ చేస్తారు?

పుష్ప-2 నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కనబెట్టేశారా? కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం