Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో స్వలింగ వివాహం : భర్తకు విడాకులిచ్చి మరో మహిళను పెళ్లాడిన వివాహిత

Webdunia
సోమవారం, 29 మే 2023 (16:08 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు వివాహం చేసుకున్నారు. ఈ స్వలింగ వివాహం తాజాగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తకు విడాకులు ఇచ్చిన ఓ వివాహిత.. తన మనస్సుకు నచ్చిన ఓ మహిళను పెళ్లి చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగాల్ రాష్ట్రానికి చెందిన మౌసుమి దత్తా, మౌమిత అనే ఇద్దరు మహిళలు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. మౌసుమి దత్తాకు ఇప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, పిల్లలను తన పిల్లలుగా స్వీకరించేందుకు మౌమిత అంగీకరించింది. దీంతో తన భర్తకు మౌసుమి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత మౌసుమి, మౌమిత ఇద్దరూ కలిసి ఓ గుడిలో స్వలింగ వివాహాన్ని చేసుకున్నారు. 
 
దీనిపై మౌమిత స్పందిస్తూ, ప్రేమ అనేది స్త్రీ పురషుల మధ్యే కాకుండా ఇద్దరు స్త్రేలు, ఇద్దరు మహిళల మధ్య కూడా చిగురిస్తుందన్నారు. మౌసుమిని వివాహం చేసుకోవడం తన కుటుంబానికి ఇషఅటం లేదని అందుకే తన ప్రియురాలితో కలిసి అద్దె ఇంట్లో కాపురం పెట్టానని తెలిపారు. మౌసుమి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని తెలిపారు. మరోవైపు మౌసుమి మాట్లాడుతూ, తన భర్త రోజూ తనను చిత్ర హింసలకు గురిచేసేవాడని, అందుకే ఆయన నుంచి విడిపోయినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments