Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ సరిహద్దుల్లోనూ మోడీ స్వచ్ఛభారత్ నిర్వహించారు.. తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో..?

పాకిస్థాన్‌లోనూ స్వచ్ఛ భారత్ నిర్వహించారంటూ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కితాబిచ్చారు. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సెహ్వాగ్.. ముందుగా ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేశాడు. ఉరీలో భారత ఆర్మీ శిబిరంపై

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (13:08 IST)
పాకిస్థాన్‌లోనూ స్వచ్ఛ భారత్ నిర్వహించారంటూ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కితాబిచ్చారు. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సెహ్వాగ్.. ముందుగా ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేశాడు. ఉరీలో భారత ఆర్మీ శిబిరంపై పాక్ ఉగ్రవాదుల దొంగదెబ్బ నేపథ్యంలో... భారత ఆర్మీ బుధవారం రాత్రి పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడటాన్ని కొనియాడాడు.

భారత సైనికులు చాలా చక్కగా ఆడారంటూ.. సైనిక దాడిని క్రికెట్ క్రీడతో పోల్చాడు. అంతేగాకుండా ప్రధాని స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సరిహద్దులు దాటించి పొరుగుదేశంలోనూ మొదలు పెట్టారంటూ వ్యాఖ్యానించారు. సైనిక దాడులు ఇందులో భాగమేనన్నారు.
 
ఇదిలా ఉంటే, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనసుకు ప్రశాంతత అని, ఇళ్ల మాదిరిగా వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించారు. ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో జరుగుతున్న స్వచ్చ్‌భారత్ వార్షికోత్సంలో మోడీ మాట్లాడుతూ.. శుభ్రతపై ఛండీగడ్‌, మైసూర్‌కే ఎందుకు పురస్కారాలు వస్తున్నాయి, మనకు ఎందుకు రావడం లేదో ఆలోచించాలన్నారు. నగరాలు, పట్టణాలను చెత్త రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని మోడీ పేర్కొన్నారు.
 
ఎన్నికలపై ఆలోచించే రాజకీయ నేతలు పరిసరాల శుభ్రతను పట్టించుకోరని విమర్శలు గుప్పించారు. పారిశుద్ధ్యం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే సరిపోదని, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కొలువైందని మోడీ పేర్కొన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments