Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ చనిపోయిన రోజునే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది : విశాల్

చెన్నై, ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సినీ నటుడు విశాల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రం అనేక నాటకీయ పరిణామాల మధ్య తిరస్కరణకు గురైంది.

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (15:23 IST)
చెన్నై, ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సినీ నటుడు విశాల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రం అనేక నాటకీయ పరిణామాల మధ్య తిరస్కరణకు గురైంది. దీనిపై విశాల్ సోషల్ మీడియా ద్వారా ఆవేదన, ఆక్రోశం వ్యక్తంచేశారు. డిసెంబర్ 5, 2016న అమ్మ(జయలలిత) చనిపోయిందని, డిసెంబర్ 5, 2017న ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని విశాల్ ట్వీట్ చేశారు. జరిగిన దానికి చింతిస్తున్నానని, ‘ప్రజాస్వామ్యానికి నా నివాళి’ అంటూ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు. 
 
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. "ప్రజలకు... గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రపతి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాను. నా పేరు విశాల్, చెన్నైలోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రక్రియలో ఏం జరుగుతోందో మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. నా నామినేషన్‌ని ఒప్పుకున్నారు.. తర్వాత తిరస్కరించారు. పూర్తిగా అన్యాయంగా వ్యవహరించారు. ఇది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు విశాల్. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments