Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో తారకరత్న మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (14:58 IST)
టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఇదే విషంయపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తన సంతాప సందేశాన్ని తెలిపారు. "తారకరత్న మృతి గురించి విని చాలా బాధపడ్డాను. ఆయన సినీ, వినోద రంగంలో తనదైన ముద్ర వేశారు. కుటుంబానికి, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి" అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు. 
 
అదేవిధంగా టాలీవుడ్ హీరో తారకరత్న మృతిపై సంతాపాలు వెల్లువెత్తున్నాయి. అటు సినీ, ఇటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాలను వెల్లడిస్తున్నారు. ఇందులోభాగంగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్.జగన్మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖర్ రావులు వేర్వేరు ప్రకటనలో తమ సంతాపాలను తెలిపారు. అలాగే, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. 
 
సినీ నటుడు, ఎన్టీఆర్ మనవడు తారకరత్న మృతి చెందిన నేపథ్యంలో సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ సీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. విషాదంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేయాలని వెల్లడించింది. 
 
తారకరత్న మృతిపట్ల సీఎం కేసీఆర్ కూడా సంతాపం వెలిబుచ్చారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా తారకరత్న మృతిట్ల సంతాపం తెలిపారు. తారకరత్న మరణవార్తతో తీవ్ర విచారం కలిగిందని అన్నారు. 
 
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, తారకరత్న కన్నుమూయడం బాధ కలిగించిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ, తారకరత్న అకాల మరణం పట్ల తీవ్ర వ్యక్తం చేస్తూ, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments