Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ చేసి చంపేస్తాం... గుర్ మెహర్‌కు బెదిరింపు, నీకెందుకమ్మా రాజకీయాలు? కిరెన్ రిజిజు

ట్విట్టర్లో ఏబీవీపికి తను భయపడేది లేదంటూ కార్గిల్ అమరవీరుడు కుమార్తె గుర్ మెహర్ ట్వీట్ చేయడమే కాకుండా ప్లకార్డు చేతపట్టుకున్న ఫోటోను కూడా అప్ లోడ్ చేయడం, ఆ తర్వాత ట్విట్టర్లో యుద్ధం తెలిసిన విషయమే. ఈ నేపధ్యంలో అటు ఏబీవీపి, ఇటు గుర్ మెహర్ మద్దతుదారులు

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (13:24 IST)
ట్విట్టర్లో ఏబీవీపికి తను భయపడేది లేదంటూ కార్గిల్ అమరవీరుడు కుమార్తె గుర్ మెహర్ ట్వీట్ చేయడమే కాకుండా ప్లకార్డు చేతపట్టుకున్న ఫోటోను కూడా అప్ లోడ్ చేయడం, ఆ తర్వాత ట్విట్టర్లో యుద్ధం తెలిసిన విషయమే. ఈ నేపధ్యంలో అటు ఏబీవీపి, ఇటు గుర్ మెహర్ మద్దతుదారులు ఢిల్లీ యూనివర్శిటీ ప్రాంగణంలో తలోవైపు ర్యాలీలు చేస్తున్నారు. 
 
దీనితో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు గుర్ మెహర్ కు బెదిరింపులు వస్తున్నాయి. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున రేప్ చేసి చంపేస్తామంటూ ఆమెకు కాల్స్ వస్తున్నాయి. దీనితో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు రక్షణ కల్పిస్తున్నారు. 
 
మరోవైపు గుర్ మెహర్ కామెంట్లపై హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ... గుర్ మెహర్ రాజకీయాలు మానేసి బుద్ధిగా చదువుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఎవరికైనా వున్నదనీ, ఐతే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. అందువల్ల గుర్ మెహర్ ఇప్పటికైనా రాజకీయ వ్యాఖ్యలు మానేసి చదువుకుంటే మంచిదని అన్నారు.
 
ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని గుర్మెహర్ ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసింది. ఇందులో తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని యుద్ధ చంపిందంటూ ఓ ప్లకార్డు పట్టుకుని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ పోస్టును చూసిన వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టయిల్లో మరో పోస్ట్ చేశాడు. తన రికార్డుల్లో ఉన్న రెండు ట్రిపుల్ సెంచరీలు తను చేయలేదనీ, తన బ్యాట్ చేసిందంటూ ప్లకార్డు పట్టుకుని నిల్చున్న ఫోజును పోస్ట్ చేశారు. సెహ్వాగ్‌కు తోడుగా మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments