Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కేటీఆర్.. ఆంధ్రాలో నారా లోకేష్... ఐటీ, పురపాలక శాఖలు..?

ఇప్పటికే పొలిట్‌బ్యూరో మీటింగ్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేష్‌ కుమారుడికి మంత్రి పదవి దాదాపు ఖాయమైంది. నారాలోకేష్‌కు మంత్రి పదవి ఇ

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (13:08 IST)
ఇప్పటికే పొలిట్‌బ్యూరో మీటింగ్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేష్‌ కుమారుడికి మంత్రి పదవి దాదాపు ఖాయమైంది. నారాలోకేష్‌కు మంత్రి పదవి ఇస్తే ఆ పదవికి సరైన న్యాయం చేస్తారని పార్టీ నేతలే ఇప్పటికీ ప్రకటనలు కూడా చేసేశారు. ఇదంతా బాగానే ఉన్నా ఇక లోకేష్‌ బాబుకు శాఖలను కేటాయించడమే తర్వాత. అయితే లోకేష్‌కు ఇప్పటికే కొన్ని శాఖలను బాబు కేటాయించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అవే ఐటీ, పురపాలక శాఖలు.
 
ఈ రెండు శాఖలు గతంలో ఇద్దరు మంత్రులు దగ్గర ఉన్నాయి. ఐటీ శాఖ పల్లెరఘునాథ్ రెడ్డి, రెండవ శాఖ పురపాలక నారాయణ వద్ద ఉన్నాయి. ఈ రెండింటిని వారి నుంచి లాక్కుని లోకేష్‌ బాబుకు చంద్రబాబు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ శాఖలను వదిలేయాలని ఇద్దరు మంత్రులను బాబు సూచించినట్టు సమాచారం. 
 
ఐటీనే ఎందుకు తీసుకొంటున్నారంటే తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే కేసీఆర్ తనయుడు కేటిఆర్ ఐటీ మంత్రిగా ముందుకు దూసుకెళుతున్నాడు. అందుకే ఏపిలో కూడా తన కుమారుడు ముందుకు పరుగులు తీయాలన్నదే బాబు ఉద్దేశం. అందుకే ఐటీ శాఖనే నారాలోకేష్‌కు కేటాయించనున్నట్లు సమాచారం. 
 
మరోవైపు ఏపీలో త్వరలో మున్సిపల్, నగర పాలిక ఎన్నికలో జరుగనుండటంతో ఆ శాఖను లోకేష్‌ బాబుకు అప్పజెబితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది బాబు ఉద్దేశం. అందుకే ప్రస్తుతం ఆ శాఖలను లోకేష్‌కు అప్పజెప్పనున్నారట. అధినేత శాఖలను ఇచ్చేయ్యమంటే ఇవ్వకుండా ఉంటారా.. ఆ శాఖలను ఇవ్వడానికి ఇద్దరు మంత్రులు సిద్ధమయ్యారట. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments