భారత అపరకుబేరుడు, పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఓ సాధారణ గ్రామస్థుడి భోజనాన్ని ఆరగించారు. ఎంతో ఆప్యాయంగా తెచ్చిన ఆ గ్రామస్థుడి భోజనాన్ని ముకేశ్ కూడా ఎంతో ఆప్యాయంగా ఆరగించారు. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఈ యేడాది ఆఖరులో జరుగనుంది. ఇందుకోసం సన్నాహాలు నెల రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి.
ఇటీవలే తొలి పెళ్లి పత్రికను సిద్ధం చేసిన అంబానీ కుటుంబం మార్చి ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ప్రీ-వెడ్డింగ్ వేడులకను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు ముందు బుధవారం రాత్రి 'అన్న సేవ' కార్యక్రమాన్ని నిర్వహించారు. గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్‌లో సామూహిక భోజనాలు ఏర్పాటుచేశారు. దాదాపు 51 వేల మందికి రుచికరమైన ఆహారాన్ని వడ్డించారు. కాబోయే వధూవరులు అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌తో ఇరువురి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముకేశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి స్వయంగా భోజనాలు వడ్డించారు.
అంబానీ ఇంట జరిగిన 'అన్న సేవ'లో చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో కొంతమంది కాబోయే దంపతులు అనంత్ - రాధిక చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. కొందరైతే బహుమతులు కూడా అందించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ గ్రామస్థుడు ముఖేష్ అంబానీ కోసం తన ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని ముకేశ్ అంబానీకి తెలియజేయగా ఆయన స్వీకరించారు. ఆహార పాత్రను తన చేతుల్లోకి తీసుకొని సంతోషంగా తింటూ కనిపించారు. ఆహారాన్ని సిద్ధం చేసి తీసుకొచ్చిన వ్యక్తికి అభినందనలు తెలియజేశారు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#MukeshAmbani - Indulging in sweets made by the talented villagers of JamnaNagar just hits different. This 10 Lakh Crorepati ke Attitude is all about supporting local communities and enjoying delicious treats. pic.twitter.com/LunCX8oQbM