Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు దేశ వ్యాప్తంగా వైద్య సేవలు బంద్

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (07:53 IST)
దేశ వ్యాప్తంగా బుధవారం వైద్య సేవలు స్తంభించనున్నాయి. నీట్ పీజీ కౌన్సెలింగ్ చేపట్టాలన్న ఏకైక డిమాండ్‌తో రెసిడెంట్ వైద్యులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో భాగంగా మంగళవారం మౌలానా ఆజాద్ వైద్య ఆస్పత్రి, కాలేజీ నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బుధవారం దేశ వ్యాప్తంగా వైద్య సేవల బంద్‌కు రెసిడెంట్ వైద్యులు పిలుపునిచ్చారు. 
 
నిజానికి నీట్ పీజీ కౌన్సెలింగ్ చేపట్టాలన్న డిమాండ్‌తో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో రెసిడెంట్ వైద్యులు నెల రోజులుగా దశల వారీగా ఆందోళన చేస్తున్నారు. కానీ, కేంద్రం ఏమాత్రం స్పందించ లేదు. మంగళవారం ఆజాద్ మెడికల్ ఆస్పత్రి నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీని తలపెట్టగా, పోలీసులు అడ్డుకుని భగ్నం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ కూడా చేశారు. 
 
దీన్ని పరిగణించిన రెసిడెంట్ వైద్యులు బుధవారం దేశ వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయాలని రెసిడెంట్ వైద్యులకు పిలుపునిచ్చారు. ఉదయం 8 గంటల నుంచే విధులకు దూరంగా ఉండాలని కోరారు. మరోవైపు, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న రెసిడెంట్ వైద్యులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఫెడరేషన్ ఆప్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ మంగళవారాన్ని బ్లాక్ డే గా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments