Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమను నిరాకరించిందనీ నిప్పుపెట్టిన సైకో లవర్

Webdunia
ఆదివారం, 8 మే 2022 (08:57 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో శనివారం తెల్లవారుజాను ఓ భవనంలో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అగ్నిప్రమాదం విద్యుదాఘాతం వల్లే సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం వెల్లడైంది. 
 
ఆ భవనంలో నివసించే ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందనందుకుగాను ఓ యువకుడి భవనానికి నిప్పుపెట్టినట్టు తేలింది. ఈ కిరాతక చర్యకు పాల్పడిన సైకోను శుభం దీక్షిత్ (27)గా గుర్తించారు. శనివారం తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న ఈ యువకుడు అక్కడ పార్క్ చేసిన స్కూటర్‌కు నిప్పుపెట్టాడు. ఆ మంటలు క్షణాల్లో చెలరేగి అక్కడ పార్క్ చేసిన ఇతర వాహనాలకు అంటుకున్నాయి. అక్కడ నుంచి భవనానికి వ్యాపించాయి. 
 
మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో అందులోని కొందరు కిందకు దూకి ప్రాణాలు కోల్పోగా ఐదుగురు మాత్రం మంటల్లో కాలిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కన్నుమూశారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘోరంపై స్థానిక పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments