Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పీటలెక్కబోతున్న గాలి జనార్దన్ రెడ్డి కూతురు... షారుఖ్ - కత్రీనా అతిథులుగా

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఏకైక కుమార్తె బ్రహ్మణి వివాహాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త విక్రం దేవారెడ్డి కుమారుడితో గాలి

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (15:11 IST)
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఏకైక కుమార్తె బ్రహ్మణి వివాహాన్ని వైభవోపేతంగా జరిపేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త విక్రం దేవారెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డితో ఈ  వివాహం వచ్చేనెల 16వ తేదీన బెంగళూరు నగరంలోని ప్యాలెస్స్ గ్రౌండ్స్‌లో అంగరంగవైభవంగా జరుగనుంది. 
 
కూతురి వివాహ వేడుకులకు వచ్చే అతిథులకు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్‌తో పాటు ప్రముఖులు, టాలీవుడ్, శాండిల్‌వుడ్ ప్రముఖులతో పాటు.. పలువురు రాజకీయ నేతలు హాజరుకానున్నారు. 
 
గతంలో గాలి జనార్దన్ రెడ్డి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామివారికి రూ.30 కోట్ల విలువ చేసే వజ్రకిరీటాన్ని బహుకరించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన కూతురి పెళ్లితో గాలి మరోసారి తెరపైకి వచ్చారు. కూతురి నిశ్చితార్ధాన్ని ఘనంగా జరిపించిన గాలి ఇప్పుడు ప్రపంచం మొత్తం అవాక్కయ్యేలా వివాహానికి దాదాపుగా రూ.200 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. 
 
తన కుమార్తె వివాహానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ, గాలి జనార్దన్ రెడ్డి అతిరథ మహారథులకు ఆహ్వానాలు పంపారు. ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకులు, నిర్మాతలు రానున్నారని, పెళ్లికి వచ్చేవారి కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రైళ్లను బుక్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం పెళ్లి వేడుకల ఏర్పాట్లలో గాలి దంపతులు బిజీబిజీగా గడుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: కుంటుతూ.. గెంతుకుంటూ చావా ట్రైలర్ ఈవెంట్‌కు రష్మిక మందన్న.. అవసరమా? (video)

నాగ్‌పూర్ పోలీసుల కోసం ఫతే ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరైన సోనూ సూద్

తెలుగులో రాబోతున్న విశాల్ చిత్రం మదగజ రాజా

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

తర్వాతి కథనం
Show comments