Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 13 నుంచి కరోనా టీకాల పంపిణీ : కేంద్రం ప్రకటన

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (18:04 IST)
దేశ ప్రజలకు కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. కరోనా భయంతో తల్లడిల్లిపోతున్న వారికి ఈ వార్త ఎంతో ఉపశమనం కలిగించనుంది. ఈ నెల 13వ తేదీ నుంచి దేశంలో కరోనా టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. 
 
దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు ఈ నెల మూడో తేదీన భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ అనుమతులు మంజూరైన పది రోజుల్లోనే టీకాల పంపిణీ ప్రారంభించాలని భావిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన 'డ్రై రన్' ప్రక్రియ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
 
భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీలో కీలకపాత్ర పోషిస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే సంయుక్తంగా తమ సన్నద్ధతను వెల్లడించడం కేంద్రం ప్రకటనకు బలం చేకూర్చుతోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments