Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లాట్‌లో రేవ్ పార్టీ: 39మంది కళాశాల విద్యార్థులు, మైనర్లు అరెస్ట్

సెల్వి
శనివారం, 10 ఆగస్టు 2024 (13:03 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఫ్లాట్‌లో ‘రేవ్ పార్టీ’పై పోలీసులు దాడి చేసిన తర్వాత 39 మంది కళాశాల విద్యార్థులను, కొంతమంది మైనర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నోయిడా సెక్టార్-39లోని సూపర్‌నోవా రెసిడెన్షియల్ సొసైటీలో 'రేవ్ పార్టీ' గురించి శుక్రవారం రాత్రి సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. 
 
ఈ క్రమంలో నోయిడాకు చెందిన ఓ విశ్వవిద్యాలయానికి చెందిన 39 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థుల వయస్సు 16 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
 
పార్టీ నుండి పెద్ద సంఖ్యలో హర్యానా లేబుల్ మద్యం సీసాలు, హుక్కాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. విచారణలో, వాట్సాప్‌లో పార్టీ కోసం విద్యార్థులను ఆహ్వానించినట్లు తేలింది. ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి రూ. 500, జంటకు రూ. 800 తీసుకున్నట్లు వెల్లడి అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments