Webdunia - Bharat's app for daily news and videos

Install App

360 గోపికలతో శృంగారం చేసిన కృష్ణుడు దేవుడే కదా..? నీలిచిత్రాలు చూస్తూ సాధ్వీలపై గుర్మీత్ రేప్?

డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ దారుణాలు బయటపడుతున్నాయి. గుర్మీత్ రామ్ రహీమ్ ఆశ్రమంలోని సాధ్వీలను తన కోరిక తీర్చుకునేందుకు వంతులు వేసుకునేవాడని 2002లో అప్పటి ప్రధాన మంత్రి వాజ్ పేయికి రాసిన లేఖలో పే

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (11:07 IST)
డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ దారుణాలు బయటపడుతున్నాయి. గుర్మీత్ రామ్ రహీమ్ ఆశ్రమంలోని సాధ్వీలను తన కోరిక తీర్చుకునేందుకు వంతులు వేసుకునేవాడని 2002లో అప్పటి ప్రధాన మంత్రి వాజ్ పేయికి రాసిన లేఖలో పేర్కొంది. తనను గుర్మీత్‌ ఏ రకంగా లోబర్చుకున్నాడో ఆ లేఖలో వివరించింది. బాబా శ్రీకృష్ణుడి సాకును చెప్తూ.. సాధ్వీలపై అత్యాచారం చేసేవాడని.. అలా తన కోరిక తీర్చుకునే వాడని తెలిసింది.  
 
గుర్మీత్‌కు రాసలీలలు జరిపేందుకు ఓ ప్రత్యేక నివాసం ఉండేందని.. అక్క బాబా నీలిచిత్రాలు చూస్తూ.. కన్నుపడిన మహిళను అనుభవించేవాడని సాధ్వి ఆ లేఖలో చెప్పింది. గుఫా అనే పేరిట వుండే ప్రత్యేక నివాసంలోకి మహిళలను తీసుకెళ్లి గన్‌తో బెదిరించి.. కోరిక తీర్చుకుంటాడు. లైంగిక దాడికి ''పితాజీ మాఫీ'' అనే పేరు కూడా పెట్టాడని బాధిత సాధ్వీ వెల్లడించింది. గుఫాలో పితాజీ మాఫీలు నిత్యకృత్యమని ఆమె వెల్లడించింది. 
 
అప్పటి ప్రధాని వాజ్‌పేయికి లేఖ రాసిన బాధితురాలైన సాధ్వీ.. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఆశ్రమంలో చేరింది. ఓ రోజు రాత్రి పది గంటల సమయంలో బాబా ప్రధాన భక్తురాలు గురుజోత్‌ తన వద్దకు వచ్చి.. గుఫాకు వెళ్లాలని చెప్పింది. తాను ఆ గదిలోకి వెళ్లే సరికి గుర్మీత్‌ టీవీలో నీలి చిత్రం చూస్తున్నాడు. తలగడ కింద రివాల్వర్‌ ఉంది. తనను చూసి టీవీ ఆఫ్ చేసి.. పక్కన కూర్చోమన్నాడు. ఆపై తనను కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. 
 
తాను దేవుడినన్నాడు. దేవుడు ఇటువంటి పనులు చేస్తాడా అని అడిగే సరికి.. 360 మంది గోపికలతో శృంగారం సాగించిన శ్రీకృష్ణుడిని మనం దేవుడిగానే చూస్తాం కదా అన్నాడు. తన కోరిక తీర్చకపోతే రివాల్వర్‌తో కాల్చి చంపుతానని, నా కుటుంబ సభ్యులనూ చంపేస్తానని బెదిరించాడని.. హర్యానా, పంజాబ్ సీఎంలు, కేంద్ర మంత్రులు తన కాళ్లు మొక్కుతారన్నాడు. ఆపై తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. 
 
ఇలా మూడు నెలల్లో 25-30 రోజులకు ఒకసారి తన వంతు వచ్చేది. పెళ్లి వయసు దాటిపోవడం.. వారి తల్లిదండ్రులు బాబాకు మూఢ భక్తులు కావడం వల్ల వారంతా రాజీపడి బతుకుతున్నారు. ఆశ్రమంలోని సాధ్వీలందరికీ వైద్య పరీక్షలు చేస్తే తాము కన్యలమో కాదో తెలిసిపోతుందని.. గుర్మీత్ అక్రమాలు వెలుగులోకి  వస్తాయని బాధితురాలు ఆ లేఖలో గుర్మీత్ బండారాన్ని బయటపెట్టింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

పరస్పరం నోరుపారేసుకున్న మోహన్ బాబు - మంచు మనోజ్!!?

బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రేమలో వున్న సమంత? చేతులు పట్టుకుని సంథింగ్ సంథింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం