Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చలు జరుగుతున్నాయ్.. రాజకీయాల్లోకి రాబోనని చెప్పడం లేదే: రజనీకాంత్

రాజకీయ అరంగేట్రంపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రాబోనని తాను చెప్పడం లేదని... దీనిపై చర్చలు సాగుతున్నాయని తెలిపారు. ఎయిర్ పోర్టులో రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. తక

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (12:15 IST)
రాజకీయ అరంగేట్రంపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రాబోనని తాను చెప్పడం లేదని... దీనిపై చర్చలు సాగుతున్నాయని తెలిపారు. ఎయిర్ పోర్టులో రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. తక్షణం రాజకీయాల్లో రావాలని అభిమానులు, తమిళ ప్రజలు ఒత్తిడి చేస్తున్న తరుణంలో.. రాజకీయ అరంగేట్రంపై ప్రస్తుతం చర్చల పరిధిలోనే ఉన్నట్లు చెప్పారు. 
 
రాజకీయాలపై నిర్ణయం తీసుకున్నాక తానే స్వయంగా ప్రకటిస్తానని రజనీ వెల్లడించారు. ఇప్పటికే ఫ్యాన్స్‌తో మే నెలలో భేటీ అయిన రజనీకాంత్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లలో ఫ్యాన్స్‌తో మళ్లీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
గత మే నెలలో అభిమానులతో సమావేశమైన రజనీకాంత్, "యుద్ధానికి సిద్ధం కండి" అని వ్యాఖ్యానించిన తరువాత, రజనీ రాజకీయ ప్రవేశంపై రకరకాల వార్తలొచ్చాయి. యుద్ధం వస్తే.. మాతృభూమిని కాపాడుకునేందుకు మీరంతా ముందుకు వస్తారని, ప్రస్తుతం చేస్తున్న వృత్తిని గౌరవిద్దాం.. యుద్ధం వచ్చిన వేళ చూసుకుందామని పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ పుట్టిన రోజు (డిసెంబర్)న రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments