Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో చెవిరెడ్డిని ఏం చేశారో తెలుసా..?

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎప్పుడు ఏదో విధంగా వార్తల్లో నిలిచే వ్యక్తి. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం చెవిరెడ్డికి అలవాటు. వైసీపీలో ఆర్కే. రోజా తర్వాత ఫైర్ బ్రాండ్ పేరు సంపాదించుకున్న చెవిర

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (11:55 IST)
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎప్పుడు ఏదో విధంగా వార్తల్లో నిలిచే వ్యక్తి. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం చెవిరెడ్డికి అలవాటు. వైసీపీలో ఆర్కే. రోజా తర్వాత ఫైర్ బ్రాండ్ పేరు సంపాదించుకున్న చెవిరెడ్డికి చంద్రగిరి నియోజవర్గ ప్రజలపై ఒక్కసారిపై ప్రేమ పుట్టుకొచ్చినట్లుంది. తిరుపతి నగరం నుంచే వ్యర్థాలను చంద్రగిరి నియోజవర్గంలోని సి.రామాపురంలో గత కొన్నిసంవత్సరాలుగా వేస్తున్నారు. 
 
ఈ చెత్త కారణంగా రామాపురం గ్రామస్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని చెవిరెడ్డి ఆందోళన చేపట్టారు. గత 15 రోజులుగా ఈ సమస్య మరింత జఠిలమైంది. చెత్త తీసుకొచ్చే వాహనాలను గ్రామస్తులు అడ్డుకోవడం.. ఆ తర్వాత చిత్తూరు ఎంపి, తిరుపతి ఎమ్మెల్యే, నగర పాలకసంస్ధ కమిషనర్లు కలిసి గ్రామస్తులతో చర్చించి కొన్నిరోజుల పాటు చెత్తను వేసుకునే పర్మిషన్ తీసుకున్నారు.
 
అయితే ఆ తర్వాత డంపింగ్ యార్డును మారుస్తారని గ్రామస్తులు భావించారు. కానీ నగర పాలకసంస్ధ అధికారులు మాత్రం చెత్తను తీసుకొచ్చి అక్కడే పడేస్తూ వచ్చారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్థతుతో ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. గత మూడురోజుల నుంచి గ్రామస్థులకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్థతుగా నిలిచారు. ఈరోజు గ్రామస్థులతో కలిసి ఆందోళన చేపట్టేందుకు చెవిరెడ్డి సిద్థమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. 
 
సి.రామాపురంలోని ఒక ఇంటిలో ఉన్న చెవిరెడ్డితో పాటు వైకాపా కార్యకర్తలు, నాయకులను పోలీసులు బలవంతంగా బయటకు తీసుకొచ్చి అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న తనను అరెస్టు చేయడంపై చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా తనను అరెస్టు చేస్తున్నారన్నారు. చెవిరెడ్డిని పోలీసులు బలవంతంగా జీపులోకి ఎక్కించారు. దీంతో వైకాపా నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డంపింగ్ యార్డును రామాపురం నుంచి తరలించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు గ్రామస్తులు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments