భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి గురించి సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించి ఆయనకు ఉపరాష్ట్రపతి పదవిని ఇచ్చి శాశ్వతంగా దేశ రాజకీయాలకు దూరం చేయడం ఏమాత్రం నచ్చలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
శనివారం రాత్రి నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో వెంకయ్యతో కలిసి రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెంకయ్య నాయుడుకి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదంటూ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు.
వెంకయ్య నాయుడికి భారత ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదన్నారు. గొప్ప నాయకునిగా పేరు తెచ్చుకున్న వెంకయ్య నాయుడును రాజకీయాల నుంచి దూరం చేశారని ఆరోపించారు. ఉప రాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవని, ఆయన మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగితే ఎంతో బాగుండేదని రజినీకాంత్ తన మనసులోని మాటను వెల్లడించారు.