Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు మిత్రుల కోసమే సాగు చట్టాలు : ప్రధాని మోడీపై రాహుల్ ధ్వజం

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (10:54 IST)
తన ఇద్దరు మిత్రుల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పైగా, దేశంలోని వ్యవసాయ వ్యాపారన్నంతా ఆ ఇద్దరు స్నేహితులకు అప్పగించేందుకు ప్రధాని అహర్నిశలు కృషిచేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
రాజస్థాన్‌ అజ్మీర్‌ జిల్లా రూపన్‌గఢ్‌లో ఆయన రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ, 'రైతులకు ఆప్షన్లు ఇస్తున్నానని అంటున్నారు. అవి.. ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు మాత్రమే' అని ఎద్దేవా చేశారు. 
 
కాగా, వారసత్వ రాజకీయాలపై వస్తున్న విమర్శలపై రాహుల్‌ స్పందించారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం తమ కుటుంబసభ్యులు ప్రధాని పదవి నిర్వహించారన్నారు. 'నాకో సైద్ధాంతిక దృక్పథం ఉంది. రాజీవ్‌ గాంధీ కొడుకుగా నన్ను చూడొచ్చు. అంతమాత్రాన సిద్ధాంతాల కోసం నేను సాగిస్తున్న పోరును ఎవరూ నిలువరించలేరు' అని ప్రకటించారు. 
 
ఇటీవల కేంద్రం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. అవి రైతులకు తీవ్ర హాని కలిగించేలా ఉన్నాయని, దేశంలోని కార్పొరేట్ శక్తులను మేలు చేకూర్చేలా ఉన్నాయంటూ దేశంలోని రైతులు గత రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. వీరికి పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. 
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments