Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో కీచకపర్వం : కాలేజీ విద్యార్థిని లాక్కెళ్లి సామూహిక బలాత్కారం

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (10:39 IST)
పాకిస్థాన్ మరో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. కాలేజీకి వెళ్లిన ఓ యువతిని ముగ్గురు కామాంధులు బలంవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన కరాచీ నగరంలో గుల్షన్ ఏ హదీద్ ప్రాంతంలో వెలుగుచూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుల్షన్ ఏ హదీద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి కళాశాలకు వెళ్లింది. చీకటిపడుతున్నా ఇంటికి రాకపోవడంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో ఆ యువతిని ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్టు తెలుసుకుని, ఆ యువతి ఆచూకీ కూడా కనుగొన్నారు. ఆ తర్వాత బాధితురాలిని తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు అనుమానితులను కరాచీ పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఇదిలావుంటే, 2020 నివేదిక ప్రకారం పాకిస్థాన్‌లో ప్రతిరోజూ 11 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నట్టు సమాచారం. గత ఆరేళ్లలో 22,000 అత్యాచారం కేసులు నమోదు కాగా ఇందులో కేవలం 0.03 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడ్డాయి. 2015లో 22,037 లైంగిక వేధింపుల కేసులు నమోదు కాగా కేవలం 4,060 కేసులు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం