డేటా వాడిన పాపానికి తమ్ముడినే హత్య చేసిన అన్నయ్య

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (10:32 IST)
స్మార్ట్ ఫోన్ల మోజుతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువ సమయం గడిపేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. వస్తు వ్యామోహంలో పడిపోయి బంధాలు, అనుబంధాలను తెంచుకుంటున్నారు. మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఇప్పుడు నిత్యవసరాలుగా మారిపోయాయి.

మొబైల్ ఫోనే లోకంగా గడిపే నేటి యువత అందులో డాటా లేకపోతే ఏదో కోల్పోయినట్లు భావిస్తున్నారు. డాటా కోసం తల్లిదండ్రులు, సోదరులు, స్నేహితులతో గొడవలకు దిగుతున్నారు. తాజాగా మొబైల్ డాటా అయిపోగొట్టాడని తమ్ముడిని అన్న హత్య చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో దారుణం జరిగింది.  
 
వివరాల్లోకి వెళితే.. జోధపూర్‌కు చెందిన రామన్, రాయ్ అన్నదమ్ములు. గత బుధవారం తమ్ముడు రాయ్..అన్న రామన్‌కు తెలియకుండా ఆయన మొబైల్ డేటాను పూర్తిగా వాడుకున్నాడు. దీంతో రామన్ తమ్ముడితో గొడవపడ్డాడు. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి వివాదం పెద్దదైంది. రాయ్‌ను బిల్డింగ్ పైకి తీసుకెళ్లిన రామన్.. కత్తితో తమ్ముడి ఛాతిలో నాలుగైదుసార్లు బలంగా పొడిచాడు. 
 
దీంతో రాయ్ రక్తం కక్కుకోవడంతో రామన్ అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రాయ్‌ను చూసిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న రామన్ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments