Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లవ్ జిహాద్' క్రూరత్వం : సుత్తితో కొట్టి చంపి.. తగలబెట్టాడు

'లవ్ జిహాద్' పేరుతో ఓ వ్యక్తి అత్యంతక్రూరంగా ప్రవర్తించాడు. ముఖ్యంగా, ఎలాంటి పాతకక్షలు లేకపోయినప్పటికీ ఓ వ్యక్తిని అతికిరాతకంగా సుత్తితోకొట్టి చంపి ఆతర్వాత శవంపై కిరోసిన్ పోసి నిలువునా తగులబెట్టేశాడు.

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (14:20 IST)
'లవ్ జిహాద్' పేరుతో ఓ వ్యక్తి అత్యంతక్రూరంగా ప్రవర్తించాడు. ముఖ్యంగా, ఎలాంటి పాతకక్షలు లేకపోయినప్పటికీ ఓ వ్యక్తిని అతికిరాతకంగా సుత్తితోకొట్టి చంపి ఆతర్వాత శవంపై కిరోసిన్ పోసి నిలువునా తగులబెట్టేశాడు. 'లవ్ జిహాద్' పేరిట తను చేసిన క్రూరత్వాన్ని స్వయంగా వీడియో తీసుకుని మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్ రాష్ట్రం రాజ్ సమంద్ జిల్లాలో శంబూనాథ్ రాయ్ (30) అనే వ్యక్తి లవ్ జిహాద్‌పై చెప్పలేనంత కోపం ఉంది. ఈ క్రమంలో రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ భట్టా షైక్ అనే వ్యక్తి హెరిటేజ్ రోడ్డులోని ఓ పార్కులో సాయంత్రం వేళలో కూర్చొని సేదతీరుతున్నాడు. 
 
అతడిపై శంబునాథ్ ఓ సుత్తితో మెరుపుదాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో ఈ ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు శంబూనాథ్‌ను అరెస్టు చేశారు. 
 
ఈ ఘటనపై రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చంద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజస్థాన్ రాష్ట్రం రాజసమంద్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా భద్రతా బలగాలను రంగంలోకి దింపారు. ఘటనపై సిట్ బృందాన్ని నియమించారు. పరిస్థితి అదుపులోనే ఉందని.. అందరూ సంయమనం పాటించాలని మంత్రి కోరారు. కాగా, శంబూనాథ్ అప్‌లోడ్ చేసిన వీడియోను అన్ని సోషల్ ప్రసార మాధ్యమాలు తమతమ సైట్ల నుంచి తొలగించాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments