Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుత్రులు పెరిగినా వివాహేతర సంబంధం కొనసాగించింది.. ప్రియుడితో పాటు బలైపోయింది.. ఎలా?

పుత్రులు పెద్దవారైనప్పటికీ.. వివాహేతర సంబంధం పెట్టుకున్న పాపానికి ఆ తల్లి బలైపోయింది. రాజస్థాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్‌లో ఇద్దరు యువకులకు తన తల్లి అక్రమ సంబంధం పెట్టుకోవడం నచ్చలేదు. తమ తల్ల

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (18:07 IST)
పుత్రులు పెద్దవారైనప్పటికీ.. వివాహేతర సంబంధం పెట్టుకున్న పాపానికి ఆ తల్లి బలైపోయింది. రాజస్థాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్‌లో ఇద్దరు యువకులకు తన తల్లి అక్రమ సంబంధం పెట్టుకోవడం నచ్చలేదు. తమ తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న తనయులు.. ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కూడా కొట్టి చంపేశారు. 
 
ఈ విష‌యాన్ని గుర్తించిన‌ గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వ‌డంతో ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ శ్రీగంగానగర్‌ జిల్లాలో గొగామెది గ్రామానికి చెందిన బల్జీత్‌ కౌర్ (39) భర్త లారీ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. వారికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. 
 
తన భర్తతో ఏర్పడిన విభేదాల కారణంగా.. ఓ కుమారుడు, కుమార్తెతో బల్జీత్ కౌర్ వేరుగా ఉంటోంది. ఈ నేప‌థ్యంలో ఆమె సుఖ్‌పాల్‌ అనే వ్యక్తితో నెలల పాటు వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే అమ్మతీరు నచ్చని ఇద్ద‌రు త‌న‌యులు విశాల్‌ సింగ్‌(21), హర్దీప్‌ సింగ్‌(19) ఆమెను, ఆమె ప్రియుడిని గొగామెది గ్రామానికి రప్పించి, పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments