Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావిలో నీరెత్తెందుకు వెళ్లిన భార్యను దూషించాడు.. అంతే ఇనుపరాడ్లతో దాడి చేశాడు..

భార్యతో ఫోనులో మాట్లాడుతుండగా... అనామకులు ఇనుపరాడ్లతో దాడి చేసి పరారైనారు. తలకు వెనుక భాగంలో ఇనుపరాడ్లతో ఆచూకీ తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (17:23 IST)
భార్యతో ఫోనులో మాట్లాడుతుండగా... అనామకులు ఇనుపరాడ్లతో దాడి చేసి పరారైనారు. తలకు వెనుక భాగంలో ఇనుపరాడ్లతో ఆచూకీ తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన సేలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కదిర్ వేల్ (38) భార్యతో సెల్ ఫోన్‌తో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
 
వాళప్పాడి, ముత్తంపట్టికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికే ఓ వ్యక్తి (బాలమణికండన్)ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతని వద్ద జరిపిన విచారణలో నీటి సమస్యే ఈ దాడికి కారణమని తేలింది.
 
బాలమణికండన్‌ భార్య బావిలో నీరు తోడుకుని ఇంటికి వెళ్తుండగా.. కదిర్ వేల్ ఆమెను దూషించాడని.. ఎందుకిలా చేశావని బాలమణికండన్‌ ఇంటికెళ్లి మందలించినా కదిర్ వేల్ దురుసుగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. భార్య పట్ల అమర్యాదపూర్వకంగా నడుచుకుని.. నోటికొచ్చినట్లు వాగిన కదిర్‌వేల్‌పై బాలమణికండన్‌ ఈ కారణంతోనే దాడికి ఒడిగట్టినట్లు వారు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments