Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజ్మీర్‌ ఎన్‌హెచ్-8లో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురి మృతి

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (12:05 IST)
రాజస్థాన్‌ రాష్ట్రంలోని అజ్మీర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదర్శ్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలోని నేషనల్ హైవే 8పై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం అనంతరం లారీల క్యాబిన్లల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. 
 
ఈ ప్రమాదాన్ని గమనించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఒక మృతదేహాన్ని వాహనంలో నుంచి బయటకు తీసి జవహర్‌లాల్‌ నెహ్రూ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 
 
మూడు మృతదేహాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని ఆదర్శనగర్ ఎస్ఐ కన్హయ్య లాల్ పేర్కొన్నారు. ఈ ఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments