Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసీ రిజర్వేషన్ కోచ్‌‌లో బ్యాగ్ చోరీ.. రైల్వేస్‌ నిర్లక్ష్యం.. బాధితుడికి రూ.5లక్షలు

జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేస్తుండగా హ్యాండ్ బ్యాగ్ చోరీకి గురైంది. అయితే హ్యాండ్ బ్యాంగ్ చోరీకి గురైందని వినియోగదారుల కోర్టుకెళితే.. రైల్వేస్ నిర్లక్ష్యానికి బాధితులకు రూ.5లక్షలు చెల్లించాలని

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (16:54 IST)
జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేస్తుండగా హ్యాండ్ బ్యాగ్ చోరీకి గురైంది. అయితే హ్యాండ్ బ్యాంగ్ చోరీకి గురైందని వినియోగదారుల కోర్టుకెళితే.. రైల్వేస్ నిర్లక్ష్యానికి బాధితులకు రూ.5లక్షలు చెల్లించాలని వినియోగదారుల ఫోరమ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే గత ఏడాది మే నెలలో శైలేష్ భాయ్, మీనాబెన్ భగత్ జంట జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌లో 2టైర్ ఏసీలో ప్రయాణించారు. 
 
మధుర, ఢిల్లీ స్టేషన్ల మధ్య వీరి హ్యాండ్ బ్యాగ్ చోరీకి గురైంది. దీనిపై మీనాబెన్ జంట రైల్వే నిర్లక్ష్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో జామ్ నగర్‌లోని వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. బ్యాగులో రూ.2 లక్షల విలువైన వస్తువులు వున్నాయని వాదించారు. కానీ ప్రయాణీకుల వాదనతో రైల్వే విబేధించింది.
 
వారు క్యారీ చేసిన లగేజీకి బుకింగ్ లేదని, ఎలాంటి ఛార్జీలు చెల్లించలేదని.. తాము అలాంటి వాటికి ఎలా బాధ్యత వహించబోమని స్పష్టం చేసింది. కానీ ఈ వాదనను వినియోగదారుల కోర్టు అంగీకరించలేదు. రైల్వే రిజర్వేషన్ కోచ్‌లలోకి రిజర్వేషన్ లేని వారు ప్రవేశించకుండా చూడాల్సిన బాధ్యత టీటీపైనే ఉందని స్పష్టం చేసింది. ఇంకా, రైల్వేస్ నిర్లక్ష్యానికి బాధితుడికి రూ.5 లక్షలు చెల్లించాలని ఫోరం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments