Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే టీసీలు కోటిన్నర ఫైన్ వసూలు... ఎందుకు, ఎలా?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (09:04 IST)
ముంబై హెడ్ క్వార్టర్‌గా పని చేస్తున్న సెంట్రల్ రైల్వే జోన్ కేవలం 9 నెలల్లో రూ.155.14 కోట్ల ఫైన్ వసూలు చేసింది. ఈ ఫైన్లు మొత్తం టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్న ప్రయాణికుల నుంచి టీసీలు వసూలు చేసినవే.

2019 ఏప్రిల్ నుంచి డిసెంబరు మధ్య టికెట్ లేని ప్రయాణికులపై సెంట్రల్ రైల్వే ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ తొమ్మిది నెలల కాలంలో స్పెషల్ డ్రైవ్స్ చేపట్టింది. టికెట్ లేకుండా ప్రయాణించే ఏ ఒక్కరినీ విడిచి పెట్టొద్దని టీసీలకు ఆదేశాలిచ్చింది.
 
ఈ తొమ్మిది నెలల్లో సెంట్రల్ రైల్వేలో పని చేస్తున్న నలుగురు రైల్వే టీసీలు రికార్డు స్థాయి కలెక్షన్ చూపించారు. ఒక్కొక్కరు రూ.కోటిపైగా ఫైన్లు వసూలు చేసి, టికెట్ లేని ప్రయాణం చేయాలంటేనే హడల్ పుట్టించారు.

ఎస్బీ గలండే అనే టికెట్ కలెక్టర్ 22,680 మంది టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారిని పట్టుకుని, రూ.1.51 కోట్ల ఫైన్లు వసూలు చేసి టాప్‌లో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో రవి కుమార్ అనే టీసీ 20,657 మంది నుంచి రూ.1.45 కోట్ల జరిమానా కట్టించారు.

ఎంఎం షిండే అనే టీసీ 16,035 మంది ప్రయాణికుల నుంచి రూ.1.07 కోట్లు, డి.కుమార్ అనే టీసీ 15,264 మంది నుంచి రూ.1.02 కోట్ల ఫైన్ వసూలు చేశారు. భారీగా జరిమానాల రూపంలో రైల్వేకి ఆదాయం తెచ్చిన ఈ నలుగురు టీసీలను సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.

సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ మిట్టల్ వీరికి సన్మానం చేశారు. ప్రతి ప్రయాణికుడు సరైన టికెట్ తీసుకునే రైలు ఎక్కాలని కోరారు సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శివాజీ సుతార్.

ఈ డ్రైవ్స్ కొనసాగిస్తామని, ఇటీవల తాము రైల్వే రెవెన్యూ భారీగా పెంచామని చెప్పారు. ఈ సొమ్మును ప్రయాణికులకు మంచి సౌకర్యాలు కల్పించేందుకు వినియోగిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం