Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై రైల్వే స్టేషన్‌లో విద్యార్థినిపై అత్యాచారం యత్నం.. ప్రియుడుని బయటకు పంపించి...

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (14:34 IST)
చెన్నై నగరంలోని ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్‌లో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘాతుకానికి పాల్పడింది కూడా ఆ స్టేషన్‌లోని బుక్కింగ్ కౌంటర్ క్లర్క్, లిఫ్టు ఆపరేటర్లు కావడం గమనార్హం. ఆ విద్యార్థిని ప్రియుడిని బలవంతంగా స్టేషన్ బయటకు పంపించి... యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కేరళకు చెందిన ఓ యువతి చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆమెకు నగరానికి చెందిన ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ సాయంత్రం వేళల్లో స్థానిక తరమణిలోని ఎంఆర్ఎటీఎస్ రైల్వే స్టేషన్‌లో రాత్రి 10.30 గంటల వరకు కూర్చొని మాట్లాడుకునేవారు. ఈ తంతు గత కొన్ని రోజులుగా సాగుతోంది. 
 
వీరిద్దరినీ టిక్కెట్ బుకింగ్ క్లర్క్ లోకేశ్వరన్ (22), లిఫ్టు ఆపరేటర్లు లూకాస్, శ్రీరామ్‌లు గత కొన్ని రోజులుగా గమనిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు పెద్దగా లేరు. ఆ సమయంలో ప్రేమికులిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అపుడు లోకేశ్వరన్, లూకాస్, శ్రీరామ్‌లు వారివద్దకు వచ్చి రాత్రి 10.30 గంటల వరకు ఇక్కడ ఏం పని అంటూ నిలదీశారు.
 
ఆ తర్వాత యువకుడిని బలవంతంగా బయటకు పంపించి, విచారణ పేరుతో యువతిని రైల్వే స్టేషన్ మొదటి అంతస్తులోకి తీసుకెళ్లి రూ.5 వేలు అపరాధం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంత మొత్తం తన వద్ద లేదని ఆ యువతి చెప్పడంతో కోర్కె తీర్చమని డిమాండ్ చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో ముగ్గురు కలిసి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. 
 
ఈ కామాంధుల నుంచి తప్పించుకుని బిగ్గరగా అరుస్తూ స్టేషన్ కిందికి దిగివచ్చి, విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌కు చెప్పింది. ఆయన తిరువాన్మియూరు పోలీసులకు సమాచారం చేరవేయడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. అత్యాచార యత్నానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments