Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌కు దక్కని జయలలిత దర్శన భాగ్యం... దేవుడిని ప్రార్థిస్తున్నానన్న రాహుల్

చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించేందుకు ఆయన ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చారు. ఆ తర్వాత ఆయన వి

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (14:16 IST)
చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించేందుకు ఆయన ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చారు. ఆ తర్వాత ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. 
 
అయితే, ఆస్పత్రి వద్ద ఆయనకు నిరాశే ఎదురైంది. అపోలో గ్రూప్ సంస్థల చైర్మన్ ప్రతాప్ రెడ్డి స్వయంగా రాహుల్‌కు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లినా, ఆయన్ను జయలలిత వద్దకు తీసుకువెళ్లేందుకు అధికారులు అంగీకరించలేదు. ఆమెను చూసేందుకు వీల్లేదని స్పష్టం చేయడంతో, ఆమె ఆరోగ్యం, ఏమైందని మాత్రమే రాహుల్ అడిగి తెలుసుకుని బయటకు వచ్చారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... జయలలిత కోలుకుంటున్నారనీ, ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పి వెళ్లిపోయారు. కాగా, ఆమెకు సుదీర్ఘకాలం పాటు చికిత్స అవసరమని, అది ఎన్నాళ్లన్నది ఇప్పుడే చెప్పలేమని వైద్యులు రాహుల్‌కు చెప్పినట్టు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments